బాల‌య్య సినిమా… గుట్టు విప్పిన అనిల్ రావిపూడి

ఎఫ్ 3 త‌ర‌వాత అనిల్ రావిపూడి సినిమా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అనే విష‌యం తెలిసిందే. నిజానికి ఈ కాంబో ఎప్పుడో సెట్ అవ్వాల్సింది. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. ఇది వ‌ర‌కు ‘రామారావు గారు’ అనే క‌థ‌ని బాల‌కృష్ణ కోసం త‌యారు చేశాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు అదే క‌థ‌ని అటూ ఇటూ మార్చి బాల‌య్య‌తో తీయ‌బోతున్నాడ‌న్న‌ది టాక్‌. ఈ విష‌యంలో అనిల్ రావిపూడి స్ప‌ష్ట‌త ఇచ్చారు.

”అప్ప‌ట్లో బాల‌కృష్ణ గారి కోసం `రామారావు గారు` అనే క‌థ‌ని త‌యారు చేశాను. కానీ ఇప్పుడు ఆ క‌థ‌ని ప‌క్కన పెట్టేశాను. ఎందుకంటే ఎప్ప‌టిక‌ప్పుడు మార్కెట్ ప‌రిస్థితిని బ‌ట్టి, మూడ్ ని బ‌ట్టి క‌థ‌లు రాసుకోవాలి. అందుకే బాల‌య్య‌ కోసం కొత్త క‌థ రాసుకున్నా. నా స్టైల్‌లో ఉంటూనే… బాల‌య్య గారి స్థాయికి త‌గిన క‌థ‌. ఆయ‌న్నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాల్ని పొందుప‌రిచా. క‌చ్చితంగా వేరే లెవ‌ల్ లో ఉంటుంది” అని క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఎఫ్ 3 తో బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి. మంగ‌ళ‌వారం అనిల్ రావిపూడి పుట్టిన రోజు. ఎఫ్ 3 సెట్లోనే ఆయ‌న బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్నారు. త‌న ప్ర‌తీ సినిమాలోనూ త‌ళుక్కున మెర‌వ‌డం అనిల్ రావిపూడికి అల‌వాటు. `ఎఫ్ 3`లోనూ ఆ సెంటిమెంట్ కొన‌సాగిస్తూ…. ఓ పాట‌లో అనిల్ రావిపూడి గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇవ్వ‌బోతున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close