ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి చేసుకొంది

సినిమాల‌కు దూర‌మైన క‌థానాయిక‌లంతా ఇప్పుడు మెల్లిమెల్లిగా పెళ్లి బాట ప‌డుతున్నారు. స‌రికొత్త జీవితానికి శ్రీ‌కారం చుడుతున్నారు. తాజాగా.. అంకిత కూడా పెళ్లి చేసుకొంది. ఈ అంకిత ఎవ‌రు? అంటారా.. చాలా గ్యాప్ వ‌చ్చేసింది క‌దా, గుర్తిండి ఉండ‌దు. చిన్న‌ప్పుడు ఐ ల‌వ్ యూ ర‌స్నా.. అంటూ ర‌స్నా యాడ్‌లో మెరిసిన చిన్నారే.. అంకిత‌. ఆ త‌ర‌వాత ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌తో హీరోయిన్ అయిపోయింది. సింహాద్రి లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్‌లో అంకిత స్థానం సంపాదించుకొంది.

అయితే ఆ త‌ర‌వాత ఎన్ని సినిమాలు చేసినా రావ‌ల్సినంత క్రేజ్ రాలేదు. న‌వ‌త‌రం క‌థానాయిక‌ల పోటీకి అంకిత త‌ట్టుకోలేక‌పోయింది. త‌మిళంలోనూ కొన్ని సినిమాలు చేసినా.. ఏదీ అచ్చు రాలేదు. అందుకే కొన్నేళ్లుగా అమెరికాలోనే ఉంటోంది. ఇప్పుడు వికాస్ అనే పూణేకు చెందిన వ్యాపార వేత్త‌ని ముంబైలో పెళ్లి చేసుకొంది. సోమ‌వారం అంకిత – వికాస్‌ల వివాహం ముంబైలోని ఓ హోటెల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈవేడుక‌కు అంకిత సినీ ప్ర‌ముఖుల్ని ఎవ్వ‌ర్నీ ఆహ్వానించ‌లేదు. పెళ్ల‌య్యాక వాళ్ల‌యాన‌తో క‌ల‌సి అమెరికాలోనే స్థిర‌ప‌డిపోతుంద‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close