మ‌హాకూట‌మి కోసం లక్నోలో మ‌హా స‌ద‌స్సు..?

నిజానికి, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏక‌తాటికి తెచ్చే మ‌హా ప్ర‌య‌త్నం క‌ర్ణాట‌క‌లోనే ప్రారంభ‌మైంది. కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేస్తున్న సమయంలోనే దేశంలోని భాజపా వ్యతిరేక పార్టీలన్నీ చేతులు కలిపాయి. 2019 ఎన్నికల ముఖచిత్రం అక్కడే కొత్త మలుపు తీసుకుంది. ఆ త‌రువాత‌, ప్ర‌తిప‌క్షాలన్నీ స‌మావేశం పెట్టుకుంటాయ‌ని అనుకున్నారు. కానీ, ఇంతవరకూ అలాంటి భేటీకి అవకాశం రాలేదు. ఆ దిశ‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఇప్పుడు చొర‌వ తీసుకుంటున్నారు. యూపీలో మాయావ‌తీ, అఖిలేష్ యాద‌వ్ లు క‌లిస్తే బాగుంటుంద‌ని ఆమే స‌ల‌హా ఇచ్చారు. ఫ‌లితంగా అక్క‌డ జ‌రిగిన వ‌రుస ఉప ఎన్నిక‌ల్లో భాజ‌పాకి తీవ్ర‌మైన ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి. ఇదే త‌ర‌హాలో 2019 లో కూడా 400 సీట్ల‌లో పోటీ ప్ర‌తిపాద‌ను కూడా మ‌మ‌తా తెర‌మీదికి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌మ‌తా బెన‌ర్జీతోపాటు ఇత‌ర రాష్ట్రాల్లోని కొంత‌మంది ముఖ్య‌మంత్రులూ పార్టీల నాయ‌కులు కూడా మ‌హా కూట‌మి ఏర్పాటుకు సంసిద్ధంగానే ఉన్నారు. వీరందరితో ల‌క్నోలో ఒక స‌ద‌స్సు నిర్వ‌హించేందుకు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఆదివారం నాడు నీతీ ఆయోగ్ స‌మావేశం ఢిల్లీలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజ‌రౌతున్నారు. ముఖ్యంగా భాజ‌పాయేత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌నే క‌థ‌నాలూ వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌నీ, ప‌నిలోప‌నిగా ఆయ‌న కూడా జాతీయ రాజ‌కీయాల వ్యూహంతోనే ఢిల్లీకి వెళ్తున్నార‌నే స‌మాచార‌మూ తెలిసిందే. ఈ స‌మావేశానికి మ‌మ‌తా కూడా హాజ‌రౌతున్నారు. దీంతో రేపటి పరిణామాలపై కొంత ఆసక్తి నెలకొంది..

ల‌క్నో స‌ద‌స్సుకు సంబంధించి ఇంకా తేదీ ఖ‌రారు కావాల్సి ఉంది. వ‌చ్చే నెల తొలివారంలో జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ స‌ద‌స్సు వేదిక‌గా మ‌హాకూట‌మి అధికారిక ప్ర‌క‌ట‌న చేయాల‌న్న ఉద్దేశంతోనే మ‌మ‌తా ఉన్నార‌ని అంటున్నారు. దీన్లో భాగంగా ముందుగా చెన్నై వెళ్లి, డీఎంకే స్టాలిన్ తో చ‌ర్చిస్తార‌నీ, ఆ త‌రువాత క‌ర్ణాట‌క, తెలంగాణ‌, ఆంధ్రా ముఖ్య‌మంత్రుల‌తో కూడా ఆమె భేటీ అయ్యేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఢిల్లీలో కొన్ని కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. మొత్తానికి, మ‌హా కూట‌మి ఏర్పాటు దిశ‌గా చ‌క‌చ‌కా పావులు క‌దులుతున్నాయ‌న్న‌ది వాస్త‌వం. ల‌క్నో భేటీ ఖ‌రారు అయితే ఆ దిశ‌గా కీల‌క‌మైన ముంద‌డుగు ప‌డిన‌ట్టు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close