పవన్ కళ్యాణ్ పై మరీ ఇంత కక్షా ?!

సోషల్ మీడియా ప్రతి సామాన్యుడి చేతిలో ఒక అస్త్రం. ఈ ఆస్త్రాన్ని వాడుకొని కొందరు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మరి కొందరు మాత్రం దిన్ని వాడుకొని రాక్షస ఆనందం పొందుతున్నారు. సోషల్ మీడియా ఎవరికి ఎంత మేలు చేస్తుందో తెలియదు కానీ.. సినీ పరిశ్రమకు మాత్రం దిని వల్ల డ్యామేజీనే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబధించి సోషల్ మీడియా వాడకం వేరే దారిలో వెళుతుంది. ఫ్యాన్స్ పేజీలు పేరుతో కొందర సినిమాల పై చేసున్న దాడి చాలా దారుణంగా వుంది. ఎవరో ఒక హీరో పేరుతొ పేజి క్రియేట్ చేసుకోవడం, మరో హీరో పై ఆయన సినిమాలపై బురద చల్లుకోవడం చూస్తూనే వున్నాం. అసలు ఆ పేజీ క్రియేట్ చేసింది ఎవరో ఎవ్వరికీ తెలియదు. కక్షా పూరిత పోస్టులతో అవతలి వాళ్ళను డ్యామిజీ చేయడమే వాళ్ళ అంతిమ లక్ష్యం.

తాజాగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకి విషయానికే వద్దాం. ఈ సినిమాకి తొలి ఆట నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడు బ్యాడ్ గా వచ్చాయి. అయితే అక్కడితో ఆగిపోలేదు. సోషల్ మీడియాలోని ఫ్యాన్స్ పేజీలు పవన్ కళ్యాణ్ పై ఎన్నడూ లేనంత దాడి చేశాయి. ఒక సినిమా ఫ్లాఫ్ అయితే ఇక అంతా అయిపోయిందన్న లెవెల్ లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పై దెబ్బ కొట్టే పోస్టులతో చేలరిగిపోయాయి. వీళ్ళంతా పవన్ కు ఏంటీ ఫ్యాన్స్ అనుకోవాలి. కానీ పేజీల పేర్లు మాత్రం పవన్ కళ్యాణ్ పేరుతోనే వుంటాయి. ముందే చెప్పుకున్నాం కదా సోషల్ మీడియాకి ఎలాంటి కంట్రోల్ వుండదని. దిన్ని ఆసరాగా తీసుకొని చేలరిగిపోతున్నారు ఏంటీ ఫ్యాన్స్. ఇక పవన్ కళ్యాణ్ జెన్యూన్ ఫ్యాన్స్ ‘దయచేసి ఆ పేజీలను బ్లాక్ చేయండి’ని విన్నవించుకుంటున్నారు. కానీ దాడి మాత్రం ఆగడం లేదు.

ఇప్పుడు లేటెస్ట్ గా అజ్ఞాతవాసి కి జరిగిన డ్యామేజీ ఏమిటంటే.. అజ్ఞాతవాసిలో వెంకటేష్ నటించిన సన్నీవేషాలను యాడ్ చేసిన సంగతి తెలిసిందే. కనీసం ఈ బజ్ తోనైనా సినిమాని కష్టాలను కొంత మేర గట్టెక్కించాలని చిత్ర యూనిట్ భావించింది. ఇది సంక్రాంతి. వెంకటేష్ ఫ్యామిలీ హీరో. కనీసం మరో మూడు రోజులైనా క్రౌడ్ ఫుల్ కావచ్చని దర్శక నిర్మాతల ఆశ. కానీ ఈ ఆశపై కూడా నీళ్ళు చల్లింది సోషల్ మీడియాలోని దురాభిమానం. అజ్ఞాతవాసిలో యాడ్ చేసిన సీన్లనీ ఇప్పుడు సోషల్ మీడియా ఫ్యాన్స్ పేజీల్లో కనిపిస్తున్నాయి. సరిగ్గా వెంకీ ఎంట్రీ ఇచ్చిన సీన్ నుండి దాదాపు ఏడు నిమషాలు వీడియో పుటేజ్.. ఇప్పుడు ఏకంగా పేస్ బుక్ లోనే పెట్టేశారు. అక్కడితో ఆగలేదు. ‘వెంకటేష్ కూడా ఈ సినిమాని కాపడలేదు. వెంకీ పవన్ సీన్స్ తుస్సుమన్నాయి’అంటూ రివ్యూలు కూడా ఇచ్చేశారు.

చాలా దారుణమైన పరిస్థితి ఇది. సినిమాకి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ప్రేక్షకుడి పర్శనల్ ఛాయిస్. అయితే ఇలా సినిమాపై కక్షా పూరితంగా వ్యవహరించడం మాత్రం ఎవరికీ తగదు. ఇది మంచి వాతావరణం కాదు. ఇది వరకూ పైరసీ అంటే సీడీలు, ఏవోవెబ్ సైట్లు వుండేవి. కానీ ఇప్పుడు కక్షా పూరిత ధోరణి కారణంగా కొందరు ఫ్యాన్సే పైరసీ నేరగాళ్ళు మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా కక్షా పూరితంగా వ్యావహరిస్తున్న వ్యక్తులు మాత్రం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి చర్యలను మీ అభిమాన హీరోలు సైతం హర్షించరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.