బాహుబలి కోరిక మేరకే భాగమతి..

బాహుబలి, రుద్రమదేవి సినిమాల తర్వాత అనుష్క లీడ్ రోల్ చేసే మరో సినిమా తెర మీదకు వచ్చింది అదే ‘భాగమతి’. పిల్ల జమిందార్ డైరక్టర్ అశోక్ రాసుకున్న ఈ కథను అనుష్క చేత తెరకెక్కించాలని అప్పట్లో బాగా ప్రయత్నాలు చేశాడు. కాని కేవలం ఒక్క సినిమా అనుభవమున్న అశోక్ ని నమ్మి అనుష్క డేట్స్ ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అరుంధతిగా అలరించిన అనుష్క రీసెంట్ గా రుద్రమదేవిగా కూడా ఆకట్టుకుంది.

భాగమతి కథ బాగున్నా దర్శకుడి మీద నమ్మకం లేకే అనుష్క ఆ సినిమా నుండి తప్పుకుంది. ప్రస్తుతం అశోక్ అంజలి లీడ్ రోల్ చేస్తున్న ‘చిత్రాంగధ’ సినిమా చేశాడు. దీని తర్వాత భాగమతి సినిమా చేద్దామనే ఊపులో ఉన్నాడు. భాగమతి కథ విని ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు యు.వి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వారు. అయితే అనుష్క ఇంకా భాగమతి సినిమా గురించి కన్ ఫ్యూజన్ లోనే ఉంది. అందుకే ప్రభాస్ చేత ఓ మాట చెప్పించి ఈ సినిమాను ఓకే చేసేలా చూస్తున్నారట యు.వి క్రియేషన్స్ అధినేతలు.

ఈ లెక్కన చూస్తే భాగమతి కూడా త్వరలో పట్టాలెక్కబోతున్నమాట. సో అనుష్క మరో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తుంది. సో భాగమతి కోసం బాహుబలి దిగి వచ్చి బ్రతిమాలాడాడని ఫిల్మ్ నగర్ టాక్. ఏది ఏమైతేనేం మరో అద్భుత సినిమాలో అనుష్కను చూడనున్నారు ఆమె అభిమానులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close