నాగ్ అడిగితే అనుష్క నో అంటుందా ?!

నాగార్జున – అనుష్కల‌ది ‘సూప‌ర్’ బంధం. అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి అడుగుపెట్టిన క‌థానాయిక అనుష్క. నాగ్ అంటే స్వీటీకీ, స్వీటీ అంటే నాగ్‌కీ ఓ ప్రత్యేక‌మైన అనుబంధం. సూప‌ర్‌, డాన్‌, ఢ‌మ‌రుకం, ర‌గ‌డ సినిమాల్లో వెండి తెర‌పై సందడి చేసిందీ జంట. నాగ్ అడిగితే గెస్ట్ రోల్ కూడా సై అంటుంది అనుష్క. సోగ్గాడే, ఊపిరి, నమో వేంకటేశాయ సినిమాల్లో స్వీటీ అతిధి పాత్రలు.. నాగ్ పై వున్న అభిమానంతో చేసినవే.

ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేయబోతుందీ జంట. నాగార్జున- రామ్ గోపాల్ వర్మ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది. మొన్ననే ఈ సినిమాకి క్లాప్ పడింది. ఈ సినిమాలో హీరోయిన్ ఇప్పుడు అనుష్క పేరు వినిపిస్తుంది. వర్మ చెప్పిన క్యారెక్టర్ కి నాగ్ అనుష్క పేరును సుచించాడట. ఈ విషయం అనుష్క దగ్గరికీ వెళ్ళింది. నాగ్ సినిమా అంటే అనుష్క నోటి నుండి ‘నో’ అనే మాట రాదు. సో.. వర్మ- నాగ్ సినిమాలో స్వీటీ ఫిక్స్ అయిపోయినట్లే. బాహుబలి తర్వాత అనుష్క ఒప్పుకున్న సినిమా అంటే కచ్చితంగా ఓ క్రేజీ ఎలిమెంటనే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close