ఓకే సినిమాలో ఐదుగురితో రొమాన్స్ చేస్తున్న అనుష్క

క్రియేటివ్ డైరక్టర్ కన్ను ఇప్పుడు స్వీటి అనుష్క మీద పడ్డది. గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత ఏ సినిమా కమిట్ అవ్వని కృష్ణ వంశీ తన తర్వాత సినిమా ఓ హార్రర్ జానర్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. హీరోయిన్ లీడ్ రోల్లో ఉండే ఈ సినిమాకు ప్రధాన పాత్ర కోసం అనుష్కని అడగడం ఆమె కూడా ఓకే చెప్పడం జరిగింది. ‘రుద్రాక్ష’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

అయితే రీసెంట్ గా రుద్రమదేవితో హిట్ కొట్టి ప్రస్తుతం సైజ్ జీరోగా రాబోతున్న అనుష్క మరోసారి అద్భుతమైన పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాలో ఇంకో విశేషమేంటంటే సినిమాలో హీరోయిన్ అనుష్క ఒక్కటే కాని హీరోలు మాత్రం ఐదుగురు దాకా ఉంటారని అంటున్నారు. అంటే ఒకే సినిమాలో అనుష్క ఐదుగురు హీరోలతో రొమాన్స్ చేస్తుందన్నమాట. ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.

ప్రస్తుతం అనుష్క సైజ్ జీరో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ నెల 27న సైజ్ జీరో ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ప్రకాశ్ కోవెలమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పివిపి బ్యానర్లో పొట్లూరి వర ప్రసాద్ నిర్మించాడు. హాట్ హీరోయిన్ అనుష్క ఐదుగురు హీరోలతో రొమాన్స్ అంటే ఆ సినిమా ఏ రేంజ్ ఉంటుందో అని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close