హమ్మయ్య.. అనుష్కను చూపిస్తారట

బాహుబలి తర్వాత అనుష్క సందడే లేకుండా పోయింది. బాహుబలితో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టేసిన దేవసేన.. తర్వాత సైలెంట్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత కొత్త కూడా ఒప్పుకోలేదు అనుష్క. కొన్ని వ్యక్తిగత విషయాలతోనే వార్తలు నిలిచింది. తన స్టాఫ్ ను తొలగించిందని, పెళ్లి చేసుకోబోతుందని, ఓ హీరోతో ప్రేమలో వుందని.. ఇలా గాసిప్స్ షికార్లు చేశాయి. అయితే ఇవన్నీ రుమార్లకే పరిమితమైపోయాయి.

అయితే ఇప్పుడు అనుష్క సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ స్వీట్ న్యూస్. భామమతి ఫస్ట్ లుక్ తో పలకించబోతుంది అనుష్క. ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎట్టకేలకు విడుదల చేస్తున్నారు. ఎల్లుండి అంటే శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ బయటికి వస్తుంది.

‘భాగమతి’కంప్లీట్ గా అనుష్క సినిమా. టైటిల్ రోల్ ఆమెదే. అనుష్క ఇమేజ్ ను బెష్ చేసుకొనే ఈ సినిమా తెరకెక్కించారు. పిల్ల జమీందార్ ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆది పినిశెట్టి, ఉన్నిముకుందన్‌ కీలక పాత్రధారులు. ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com