సర్కారు ఆత్మరక్షణ-ప్రతిపక్షం విజృంభణ

ఇటీవలి పక్షం రోజులు చంద్రబాబు ప్రభుత్వానికి రాహుకాలమని తెలుగు దేశం యువ నేత ఒకరన్నారు. తమ వాళ్ల తప్పిదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరి కావలసి వచ్చింది. నందిగామ ఆస్పత్రిలో కలెక్టర్‌ను బెదిరించారనే ఆరోపణపై ప్రతిపక్ష నేత జగన్‌ను ఇరకాటంలో పెట్టామనుకుంటే అంతకు మించిన వరుస ఘటనలు ప్రభుత్వాన్ని ఇబ్బందిలో పెట్టాయి. ఆరెంజ్‌ బస్సు ప్రమాదంపై ఆర్టీఎ కమిషనర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంపిఎల్‌ఎల ఉదంతం, దానిపై నిరసన తెల్పుతున్న వైసీపీ ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేసి తీసుకుపోవడంలో పోలీసులు అత్యుత్సాహం రెండూ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పెట్టాయి. ఎంతగా అంటే అగ్రశ్రేణి పత్రికలో వీటిపై చంద్రబాబు ఆగ్రహించినట్టు కథనాలు వెలువరించి సరిపెట్టాలని ప్రయత్నించారు. ఇంతలోనే నారాయణ స్కూలులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజి ఉదంతం భగ్గుమన్నది. సకాలంలో స్పందించి ఖండించకపోగా నారాయణ మంత్రి హౌదాలో గాక ప్రైవేటు సంస్థ యజమానిగా మారిపోయి అరగంట సేపు ఏమీ జరగలేదని సర్దిచెప్పడానికి తంటాలు పడ్డారు.మరో విద్యా సంస్థల అధినేత మంత్రి పల్లెరఘునాథరెడ్డి ఆయనను బలపర్చారు.సంబంధిత శాఖా మంత్రి నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాస్ రావు వుండనే వున్నారు. జరిగిన ఘటనపై వెంటనే విచారణకు సిద్దపడి నిజానిజాలు తేల్చేబదులు రాజకీయ రక్షణకే పాలకపక్షం పాకులాడింది. ఎదురుదాడి చేసింది. ఆఖరుకు అధికారిక ప్రకటన ఎప్పుడు ఎలా అనేది కూడా హఠాత్తుగా నిర్ణయించి ముక్తసరిగా ముగించేశానుకుంది. ఆ దశలో ప్రతిపక్షం మామూలుకంటే తీవ్రంగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును చుట్టుముట్టాకే చర్చ మొదలైంది. ఆ చర్చలోనూ అనవసర విషయాలుఎలా వున్నా ప్రతిపక్ష నేత ప్రభుత్వ వ్యూహాలను బాగానే బహిర్గతం చేశారు. అంతేగాక తన స్కూలు చదువుపై నిరాధారమైన అపహాస్యం చేస్తున్న అధికార పక్షానికి గట్టి జవాబే ఇచ్చారు. అంతటితో ఆగక చంద్రబాబు ఇంగ్లీషుపైనా పిహెచ్‌డిపైన కూడావ్యాఖ్యలు చేశారు. విచారణ జరిపిస్తే సాక్షి తరపున పూర్తి సహకారం ఇస్తామన్నారు. ఇదంతా వదలిపెట్టి సాక్షి విలేకరి విజిల్‌ బ్రౌజరా లేక స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేశాడాతేల్చడంముఖ్యమైనట్టు చంద్రబాబు మాట్లాడ్డం విచిత్రంగా వుంది. గతంలోనూ పత్తిపాటి పుల్లారావుపై ఆరోపణలు వచ్చినపుడు ఆయనో జగనో ఎవరోఒకరే వుండాలని లేనిపోని సవాళ్లు చేసి చర్చను దారితప్పించారు. ప్రతిపక్షం లోపాలువున్నా ఈ దశమొత్తం ప్రభుత్వమే సమర్థనతో సతమతమైంది నిజం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close