రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసిన ఏపీ అసెంబ్లీ

ఐదు రోజులపాటు సాగిన ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారంతో ముగియడంతో శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ ఐదు రోజుల్లో అధికార, ప్రతిపక్షాలు తిట్ల పురాణాలతో కాలక్షేపం చేసినా చివరి రోజయిన ఈరోజు వైకాపా వాక్ అవుట్ చేసి వెళ్లిపోయిన తరువాత ప్రభుత్వం కత్తిలాంటి రెండు బిల్లులను ఆమోదించింది. వాటిలో ఒకటి అక్రమాస్తులను కూడబెట్టే ప్రజా ప్రతినిధుల, ప్రభుత్వోద్యోగుల ఆస్తుల జప్తుకు వీలు కల్పించే బిల్లు కాగా, మరొకటి ప్రజలకు కుచ్చు టోపీలు పెడుతున్న చిట్ ఫండ్ కంపెనీలు, ఆర్ధిక సంస్థల భరతం పట్టే బిల్లు.

ఏపి ప్రత్యేక కోర్టుల బిల్లు: ఎవరయినా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రజా ప్రతినిధి అక్రమాస్తులను కలిగి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తిస్తే వారిని సంజాయిషీ కోరుతూ విచారణాధికారి నోటీసులు జారీ చేస్తారు. ఒకసారి నోటీసు జారీ అయిన తరువాత సదరు ఆస్తుల బదిలీ లేదా అమ్మకంపై నిషేధం అమలులోకి వస్తుంది. నోటీసు అందుకొన్న నాలుగు వారాలలోగా సదరు వ్యక్తి ఆ ఆస్తులు చట్టబద్దంగా సంపాదించినవేనని నిరూపించుకోవలసి ఉంటుంది. లేకుంటే ప్రభుత్వం ఆ ఆస్తులను జప్తు చేసి ప్రత్యేక కోర్టులో కేసు నమోదు చేస్తుంది. ప్రత్యేక కోర్టులు కూడా నిర్దిష్ట సమయంలో ఈ కేసులను పరిష్కరించవలసి ఉంటుంది. ఆ ఆస్తులలో చట్టబద్దంగా సంపాదించబడిన వాటిని మినహాయించి ప్రభుత్వం మిగిలిన వాటిని స్వాధీనం చేసుకొంటుంది.

డిపాజిటర్ల రక్షణ చట్టం-1999: సవరించబడిన ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో కొత్తగా చిట్ ఫండ్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, ఆర్ధిక లావాదేవీలు చేసే సంస్థలు స్థాపించిన వారం రోజుల్లోగా తమ సంస్థ నిర్వహించబోయే వ్యాపార కార్యక్రమాలు, చేయబోయే లావాదేవీలు, సంస్థ ఆస్తులు, అప్పులు వగైరా పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ మరియు సూపరిండెంట్ ఆఫ్ పోలీసుకి సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతీ మూడు నెలలకొకమారు సంస్థ లావాదేవీల గురించి పూర్తి వివరాలు జిల్లా కలెక్టర్ మరియు సూపరిండెంట్ ఆఫ్ పోలీసుకి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా సమర్పించకపోయినట్లయితే రూ. 50, 000 జరిమానా విధించబడుతుంది.

ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుండి ఆర్ధిక సంస్థలు మదుపరుదారుల నుండి వసూలు చేసిన మొత్తాన్ని, వడ్డీని కూడా సకాలం చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ సకాలంలో చెల్లించక పోయినా లేదా బోర్డు తిప్పేసినా ప్రభుత్వం సంబంధిత సంస్థ ప్రమోటర్, మేనేజర్, అధికారులు, ఉద్యోగులపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి జైలుకి పంపించుతుంది. ఒకవేళ మధుపరుదారులను సంస్థ మోసం చేసినట్లు రుజువయితే ప్రభుత్వం సంస్థ ప్రమోటర్ లేదా డిపాజిట్లను దిగమింగిన వ్యక్తుల ఆస్తులను జప్తు చేస్తుంది. అంతే కాదు వారికి గరిష్టంగా పదేళ్ళు జైలు శిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న ఆ ఆస్తులను వేలం వేసి ఆ వచ్చిన సొమ్మును మోసపోయిన మదుపరుదారులకు తిరిగి చెల్లిస్తుంది.

ఇంత కటినమయిన చట్టం తీసుకురావడం చాలా హర్షణీయమే. కానీ వాటిని అంతే ఖచ్చితంగా అమలుచేసినప్పుడే వాటికి విలువుటుంది. ఈ చట్టాలు అక్రమార్కుల పాలిత వజ్రాయుధంలా ఉన్నాయి. కానీ అధికార పార్టీ వీటిని ఉపయోగించుకొని తన రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం కూడా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close