బీజేపీకి “పవర్” బ్యాచ్ టెన్షన్..! పార్టీలో ఉంచేదెలా..?

భారతీయ జనతాపార్టీలో ఇప్పుడు “పవర్” బ్యాచ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పవర్ బ్యాంచ్ అంటే ఎవరో కాదు.. గత ఎన్నికల ముందో..తర్వాతో..బీజేపీ అధికారంలోకి వస్తుందని భావించి ఆ పార్టీలో చేరిన వాళ్లు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అస్థిత్వం పూర్తిగా కనుమరుగవడంతో… ఆ పార్టీలోని చాలా మంది నేతలు.. వైసీపీలోకి వెళ్లిపోయారు. కొద్ది మంది నేతలు.. మాత్రం… కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో బీజేపీ పంచన చేరారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందు.. చాలా మంది ఎన్నికల తర్వాత చేరారు.

దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నాలక్ష్మినారాయణ, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇలాంటి వారే. వీళ్లే కాదు.. గోదావరి జిల్లాలకు చెందిన సత్యనారాయణ రాజు లాంటి నేతలు కూడా కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరుకున్నారు. వీరికి ఈ నాలుగేళ్లు బాగానే గడిచింది. ఓ మాదిరి నేతలు కూడా లేని బీజేపీలో వీరికి ప్రాధాన్యత దక్కింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంది కాబట్టి.. ఆ పార్టీని భయపెట్టో.. బతిమాలో.. తమ సీట్లను బీజేపీ కోటాలో ఉంచుకుందామని ఆశించారు. కానీ టీడీపీతో పొత్తు చెదిరిపోవడంతో… గతంలో కాంగ్రెస్‌కన్నా దారుణమైన పరిస్థితి ఇప్పుడు బీజేపీకి కనిపిస్తూండటంతో ఒక్కొక్కరు సర్దుకుంటున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు.

కన్నా లక్ష్మినారాయణ చేరిక ఆగిపోయింది. దీనికి కారణం అమిత్ షా బెదిరింపులన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలను ముఖ్యంగా… కన్నా,కావూరి, పురంధేశ్వరి వంటి నేతలను.. పార్టీలో చేర్చుకోవద్దని జగన్‌ను అమిత్ షా ఆదేశించారట. ఇలా బెదిరింపులకు దిగి.. పార్టీ వలసల్ని ఎంత కాలం ఆపుతారనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీతో పొత్తు ఉంటుందో లేదో తెలియడం లేదు. పొత్తు ఉన్న జగన్మోహన్ రెడ్డి.. బీజేపీలో పొటెన్షియల్ లీడర్లందరికీ అవకాశం కల్పిస్తారో లేదో తెలియదు. ఎందుకంటే.. ఇటీవలి కాలంలో… బీజేపీ తరపున చాలా మంది నేతలు తెరపైకి వచ్చారు. చంద్రబాబును విమర్శించి తాము కూడా లీడర్లమేనని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పరిణామాల మధ్య… వాళ్లను ఎంత కాలం కట్టేసి ఉంచగలనేది ఎవరికీ అర్థం కావడంలేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నుంచి వలసలు పెరిగితే..ఆ ప్రభావం.. తీవ్రంగా ఉంటుంది. కాంగ్రెస్ లాగా.. బీజేపీ కూడా ఐసోలేట్ అయిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. కనీసం ఈ ప్రచారాన్ని ఆపడానికైనా.. నేతల వలసల్ని అడ్డుకట్ట వేయడానికి షా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు ఎక్కువ రోజులు సఫలమయ్యే అవకాశాల్లేవనేది రాజకీయ నిపుణులు చెప్పే మాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close