పోలవరంపై కన్నా కొత్త ఆపరేషన్..! ఢిల్లీ సూచనలతోనే..!?

పోలవరంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఏపీ బీజేపీ బృందాన్ని పోలవరాన్ని పరిశీలించి.. తమకు నివేదిక అందచేయాలని… ఆదేశించింది. దీంతో కన్నా లక్ష్మినారాయణ బృందం శుక్రవారం పోలవరం పర్యటనకు వెళ్తోంది. ఏపీ సర్కార్… తీసుకున్న కాంట్రాక్టర్ల తొలగింపు, రివర్స్ టెండరింగ్ లాంటి వాటిని బీజేపీ విమర్శిస్తోంది. ప్రాజెక్ట్ ను ఏపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందంటూ.. విమర్శలు ప్రారంభించింది. శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ బృందం… పదమూడో తేదీన ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తారు. పోలవరంపై ప్రత్యేక నివేదిక ఇవ్వనున్నారు. అలాగే పదిహేనో తేదీన హైదరాబాద్ లో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సమావేశం జరగనుంది. ఈ నేపధ్యంలో కన్నా బృందం ఇవ్వబోయే నివేదిక కీలకం కానుంది.

అయితే పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రం తమ అధీనంలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే పోలవరం ప్రాజెక్ట్ కాంక్రీట్ నిర్మాణం మరో 30 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడున్న అడ్డంకులన్నింటినీ అధిగమిస్తే ప్రాజెక్టును.. రెండేళ్లు కాకపోతే.. మూడేళ్లలో పూర్తి చేయవచ్చు. కానీ అలా చేస్తే ప్రాజెక్టు పూర్తయినట్లేనా. అవకాశమే లేదు. ప్రాజెక్ట్ పూర్తి అంటే… ఆ ప్రాజెక్ట్ కింద ముంపునకు గురయ్యే వారందరికి సహాయ, పునరావాస కార్యక్రమాలు పూర్తి కావాలి. అప్పుడే ఆ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడం కాదు.. సహాయపునరావాసాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే.. దాదాపుగా 35వేల కోట్లు కావాలి. ఈ ఖర్చు దగ్గరే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. పార్లమెంట్‌లో కూడా.. సహాయ, పునరావాస ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రం చెబుతోంది.

నిజానికి జగన్మోహన్ రెడ్డి.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీని, కేంద్ర సర్కార్ ను లెక్క చేయకుండా… రివర్స్ టెండర్లకు వెళ్లినప్పుడే కేంద్రం కఠినమైన నిర్ణయం తీసుకోవాలనుకుందని ప్రచారం జరిగింది. అయితే సహాయ, పునరావాస ఖర్చుల కారణంగానే వెనుకడుగు వేసిందని చెబుతున్నారు. ఈ అడ్డండికిని అధిగమించేలా… చట్టం ప్రకారం ప్రాజెక్ట్ బాధ్యతను తీసుకుని.. సహాయ, పునరావాస బాధ్యతల్ని… ఏపీ సర్కార్ కు వదిలేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం… ఏపీ బీజేపీ నేతల్ని నివేదిక అడిగినట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిర్వాసితుల క‌న్నీటికి స‌మాధానం ఉందా…? బీఆర్ఎస్ అభ్య‌ర్థిపై వైర‌ల‌వుతోన్న పోస్ట్!

మా క‌న్నీటికి నీ ద‌గ్గ‌ర స‌మాధానం ఉందా? మ‌మ్మ‌ల్ని ముంచి నువ్వు తెచ్చుకున్న సీటులో గెల‌వ‌గ‌ల‌వా...? బ‌త‌కొచ్చినంత మాత్రాన నువ్వు లోక‌ల్ ఎట్లా అయిత‌వ్...? ఇలాంటి ప‌దునైన మాట‌ల‌తో మెద‌క్ బీఆర్ఎస్ అభ్య‌ర్థి,...

హైదరాబాద్‌లో డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు సహజం... కానీ తెలంగాణ పోలీసులు ఇంకో అడుగు ముందుకేశారు. ఏకంగా డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేయాలని నిర్ణియంచుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు...

మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకును వెంటాడుతున్న హిట్ అండ్ ర‌న్ కేసులు

బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసులో తవ్విన‌కొద్దీ నిజాలు బ‌య‌ట‌కొస్తూనే ఉన్నాయి. ఓ కేసులో తీగ‌లాగితే గ‌తంలో జ‌రిగిన కేసుల్లో త‌ను త‌ప్పించుకున్న తీరు బ‌య‌ట‌కు...

2024 బాక్సాఫీస్ : సెకండాఫ్ పైనే ఆశ‌లు

ఈ యేడాది అప్పుడే నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. కీల‌క‌మైన వేస‌వి సీజ‌న్ స‌గానికి వ‌చ్చేశాం. సంక్రాంతిలో మిన‌హాయిస్తే స్టార్ హీరోల సినిమాలేం బాక్సాఫీసు ముందుకు రాలేదు. ఈ వేస‌వి చాలా చ‌ప్ప‌గా, నీర‌సంగా,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close