అంతన్నారు.. ఇంతన్నారు .. ఇప్పుడు రూ.265 కోట్లు..!

రూ. 1150 కోట్లు విడుదల చేస్తే చాలు. రూ. పదివేల డిపాజిట్ చేసిన ప్రతీ ఒక్కరినీ ఆదుకోవచ్చు. కానీ ఈ సర్కార్‌కు చేతులు రావడం లేదు. నేను.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ భేటీలోనే ఈ మొత్తం విడుదల చేస్తా. అందర్నీ ఆదుకుంటానని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో… హోరెత్తించారు. అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కడ ఎక్కువ ఉంటే.. అక్కడ… ఈ డైలాగ్ చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆయన మాటలు నమ్మారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోంది. కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. జీవో జారీ చేశారు. కానీ.. ఇప్పుడు మాత్రం.. రూ. 265 కోట్లు విడుదల చేస్తున్నామంటూ.. ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

రూ. 1150 కోట్ల విషయాన్ని.. బడ్జెట్‌లో పెట్టిన విషయాన్ని.. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ప్రభుత్వం ఆయనకు చాన్సివ్వలేదు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఓ సారి తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు.. పోరాటానికి సిద్ధమవుతున్నారని తెలియగానే.. మరోసారి నిధులు రిలీజ్ అంటూ ప్రకటన చేశారనే విమర్శలు వస్తున్నాయి.

అయితే.. ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన నిధులను గత ప్రభుత్వమే విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన ఏపీ సర్కార్ రూ. 250 కోట్లు… వేలం ద్వారా వచ్చిన మరో రూ. 50కోట్లు కలిపి… మూడు వందల కోట్లను.. అగ్రిగోల్డ్ బాధితులకు పంచేందుకు.. విడుదల చేశారు. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి జీవో కూడా.. విడుదల చేశారు. మొత్తంగా రూ. మూడు వందల కోట్లు. మొత్తం కోర్టు పర్యవేక్షణలో పంపకం జరగాల్సి ఉంది. దీంతో.. మొదట.. రూ. పదివేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించాలని జాబితా సిద్ధం చేశారు. దాన్ని పెండింగ్‌లో పెట్టేసిన సర్కార్.. ఇప్పుడు.. కొత్తగా.. ఆదేశాలు జారీ చేసింది. అదనంగా ఎలాంటి నిధులు విడుదల చేయలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close