కెసిఆర్ బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తున్నారా?

మంచి పనులు ఎవరు చేసినా వారిని స్వాగతించాలి. వారిని ప్రేరణగా తీసుకొని ఇతరులు కూడా మంచి పనులు చేస్తే వారినీ మెచ్చుకోవలసిందే. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయని కేంద్రప్రభుత్వంతో సహా దేశంలో చాలా రాష్ట్రాలు మెచ్చుకొంటున్నాయి. దానిని అమలుచేయడానికి ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అయితే రెండు ప్రభుత్వాల మధ్య, వాటిని నడిపిస్తున్న తెదేపా, తెరాసల మధ్య నెలకొన్న విభేధాల కారణంగా తెలంగాణా ప్రభుత్వ ప్రేరణతోనే చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకోవడం లేదని భావించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా కాలం క్రితమే చెరువుల పూడిక తీసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఆ కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇక నుంచి చెరువులతో బాటు, వాగులు, వంకలలో కూడా యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులని, చెరువులని అనుసంధానం చేసే పనులు కూడా మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులని ఆదేశించారు. సాధారణంగా ఇటువంటి పనులన్నీ వేసవి కాలంలోనే పూర్తిచేస్తుంటారు. కానీ ఇప్పుడు వర్షాలు మొదలయిన తరువాత చెరువులలో పూడిక తీయడం అంటే చాలా కష్టం..దాని కోసం ప్రభుత్వం అధనంగా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. కనుక వచ్చే ఏడాదిలోనైనా చెరువుల పూడికతీత పనులని ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తే మంచిది.

అలాగే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా పోటాపోటీగా చేపట్టాయి. అది చాలా మంచిపనే. కాకపోతే తెలంగాణాలో ఆ కార్యక్రమంలో ప్రజలని ఎక్కువగా భాగస్వాములుగా చేస్తుంటే, ఎపిలో ప్రభుత్వమే ఆ పని చేసుకుపోతోంది. ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవ్వాలంటే ప్రజల సహకారం తప్పనిసరి.

మంచి పనులే కాదు అప్రజాస్వామిక, అనైతికమైన పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తన శిష్యుడు కెసిఆర్ మార్గంలోనే ముందుకు సాగుతున్నారు. ఆ విషయంలో ఇద్దరూ చాలా చెడ్డపేరు, విమర్శలు మూటగట్టుకొన్నారు. కానీ ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కంటే కెసిఆరే తను అనుకొన్నది సాధించారని చెప్పకతప్పదు. శత్రుశేషం, రుణశేషం ఉండకూడదంటారు పెద్దలు. ఆ ప్రకారమే కెసిఆర్ రాష్ట్రంలో తెదేపాతో సహా ప్రతిపక్ష పార్టీలని అన్నిటినీ దాదాపు నిర్వీర్యం చేసే వరకు వాటిని వదిలిపెట్టలేదు. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని చెప్పక తప్పదు. 20మంది వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలోకి ఫిరాయింపజేసినప్పటికీ, నేటికీ వైకాపా అంతే బలంగా నిలిచి ఉంది. పైగా ఇంకా గట్టిగా తెదేపా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటోంది. అది విసురుతున్న సవాళ్ళని ఎదుర్కోలేక తెదేపా చాలా ఇబ్బందిపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close