జూన్ నుంచి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ మొదలు

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను అమరావతి తరలించే విషయంపై శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

వారి చర్చలో అంగీకరించిన విషయాలు:
· 15-20 శాతం మంది ఉద్యోగులు మరొక ఏడాది వరకు హైదరాబాద్ లోనే పనిచేస్తారు.
· జూన్ నెలలో 6,000 మంది, జూలైలో 3,000 మంది, ఆగస్టులో 3,000 మంది ఉద్యోగులను అమరావతికి తరలిస్తారు.
· ప్రస్తుతం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంపైనే మరో రెండు అంతస్తులు నిర్మించి, అందులోనే వివిధ కమీషనరేట్స్, డైరెక్టరేట్స్ ను ఏర్పాటు చేస్తారు.
· తాత్కాలిక సచివాలయం సమీపంలోనే ఉద్యోగులు అందరికీ బ్యాచిలర్ ఎకామిడేషన్, ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.
· వారానికి ఐదు రోజుల పని విధానం అమలుచేయబడుతుంది.
· ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు.

వీటిలో చాలా వాటికి ఇరు పక్షాలు దాదాపు అంగీకరించాయి. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఆయన చేత ఆమోదముద్ర వేయించుకోవడమే మిగిలుందని భావించవచ్చును. ఇవి కాక ఉద్యోగులు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.

· హైదరాబాద్ లో మాదిరిగానే సీసీఏ, 30 శాతం ఇంటి అద్దె భత్యం చెల్లించాలి.
· ఉద్యోగుల కుటుంబాల తరలింపు కోసం ఒక నెల జీతం లేదా మూల వేతనం చెల్లించాలి.
· ఇంటి సామాను తరలింపుకి ఎంత ఖర్చయితే అంతా ప్రభుత్వమే భరించాలి.
· ఉద్యోగుల పిల్లలకి వారు కోరుకొన్న కళాశాలలోనే విద్యాశాఖ అడ్మిషన్స్ ఇప్పించాలి.
· వారానికి ఒకసారి హైదరాబాద్ వెళ్లి వచ్చేందుకు ఏడాదిపాటు ఆర్టీసీ బస్సు టికెట్స్ పై రాయితీ, స్వంత వాహనాలలో వెళ్ళేవారికి టోల్ టాక్స్ మినహాయింపునివ్వాలి.
ఈ డిమాండ్లపై ముఖ్యమంత్రితో చర్చించి వారం రోజులలోగా తమ నిర్ణయం తెలియజేస్తామని మంత్రి నారాయణ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్న ఎల్ అండ్ టి మరియు షాపూర్ జీ పల్లోంజీ సంస్థలతో మరో రెండు అంతస్తుల నిర్మాణానికి తక్షణమే ఒప్పందం చేసుకొంటామని మంత్రి నారాయణ చెప్పారు. ఆ రెండు సంస్థలతో ఇంతకు ముందే ఈ విషయం మాట్లాడామని అందుకు వారూ సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close