ఏపీకి రెండు టీఎంసీలు.. అభ్యంతరం చెప్పని తెలంగాణ..!

రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల జగడం నేపధ్యంలో.. జరిగిన కేఆర్ఎంబీ భేటీ… తేలిగ్గా సాగిపోయింది. కోటాను మించి వాడుకున్నారు నీటి విడుదలను ఆపాలని.. కేఆర్ఎంబీ ఇప్పటికే ఏపీ సర్కార్ ను ఆదేశించింది. అయితే.. .. తమకు రెండు టీఎంసీల నీరు కావాలని ఏపీ సర్కార్.. శుక్రవారం జరిగిన భేటీలో ప్రతిపాదన పెట్టింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో కేఆర్ఎంబీ రెండు టీఎంసీల నీటిని విడుదల చేసుకోవడానికి అంగీకారం తెలిపింది. రుతుపవనాలు వచ్చే వరకూ.. తాగునీటి అవసరాల కోసం.. ఈ రెండు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోనుంది. సాగర్ కుడి కాలువ ద్వారా.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి కోసం ఈ నీటిని పంప్ చేసుకుంటారు.

నిజానికి కృష్ణాలో ప్రస్తుతం 60 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో.. 57 టీఎంసీలు వాడుకోవడానికి తెలంగాణకు హక్కు ఉంది. ఇప్పటి వరకూ కేటాయించిన నీటిలో తెలంగాణ తక్కువగా వినియోగించుకుంది. ఆ నీటిని వాడుకోవలేదు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానుంది. రుతుపవనాలు మరో వారం .. పది రోజుల్లో వస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. కృష్ణాబేసిన్ లో వర్షాలు ప్రారంభమైతే.. వరద వస్తుంది. ఆ తర్వాత సీజన్‌కు మళ్లీ కొత్త కేటాయింపులు చేస్తారు. పాత నీటిని వినియోగించుకోలేదని.. ఆ నీటిని తర్వాత ఏడాదికి బదిలీ చేయడానికి లేదు.

ఏ ఏడాదికి ఆ ఏడాది మాత్రమే ఉపయోగించుకోవాలి. దాంతో.. ఇప్పుడు… అందుబాటులో ఉన్న మొత్తాన్ని తెలంగాణ వాడుకునే అవకాశం లేదు కాబట్టి.. ఏపీకి రెండు టీఎంసీల విడుదలకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీ మాత్రం.. తమకు కావాల్సిన కోటాలోనే అడిగామని.. కృష్ణాబోర్డు అంగీకరించిందని.. వాదిస్తోంది. మొత్తానికి ఏదైనా కానీ.. వేసవి కాలంలో… దారం తీర్చేందుకు రెండు టీఎంసీల నీరు.. ఏపీకి విడుదలవబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close