పెళ్లి చేసుకుంటే రూ.లక్ష..! ఏపీ ప్రజలకు మరో రత్నం..!

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక విషయంలో ఇప్పటి వరకూ ఓ లెక్క… రేపట్నుంచి టన్నుల్లెక్క ఉండనుంది. ప్రజలకు ఇసుకను టన్నును రూ. 375 అందించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. ఇక నుంచి ఏపీలో ఇసుక అమ్మకాలు ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారానే జరుగుతాయి. ఇసుక కావాల్సిన వారు ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే… సరఫరా చేస్తారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాను నిషేధించారు. స్టాక్ యార్డులు సహా.. మొత్తం ఆన్ లైన్ విధానంలోనే ఇసుక పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. మంత్రి వర్గ సమావేశంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆశావర్కర్ల వేతనాల పెంపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి ఆశా వర్కర్ల వేతనాలు 10వేలకు పెరగనున్నాయి. నిజానికి తొలి కేబినెట్ భేటీలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అయినా మరోసారి ఆమోద ముద్ర వేశారు. ఆటోలు, ట్యాక్సీల ఓనర్‌ కమ్‌ డ్రైవర్లకు.. ఏడాదికి రూ.10 వేలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌ పెళ్లి కానుక పథకాన్ని శ్రీరామనవమి నుంచి ఈ పథకం అమల్లోకి తెస్తామని.. పెళ్లి రోజే నగదు చేతికి అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెళ్లి కానుక కింద లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల పెళ్లికి కూడా లక్ష ఇస్తాం ఇవ్వబోతున్నట్లుగా తెలిపారు. టీటీడీ బోర్డులోని సభ్యుల సంఖ్యను 16 నుంచి 25కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సభ్యుల్ని.. ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ.. ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీ ప్రకారం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సి ఉంది. కానీ కేంద్రం అనుమతి కావాల్సి ఉండటం, ఇతర కారణాల వల్ల ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో విలీనం సాధ్యం కాదని భావించడంతో .. ఇప్పటికి ఉద్యోగుల్ని విలీనం చేయనున్నారు. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచనున్నారు. మంత్రి వర్గం .. పలు రద్దు నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రివర్స్ టెండరింగ్‌ పద్ధతిలో తాజా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీ చేయాలని తీర్మానం చేసింది. మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close