గణేష్ మండపాల నుంచీ డబ్బులు పిండుకుంటున్న ఏపీ సర్కార్ !

ఏపీ ప్రభుత్వానికి డబ్బులు వసూలుకు ఎక్కడ చాన్స్ దొరికితే చాలు అక్కడ పిండేసుకోవడానికి చిత్రవిచిత్రమైన ఐడియాలు వస్తూంటాయి. తాజాగా గణేష్ మండపాల విషయంలోనూ అదే జరుగుతోంది. వినాయకచవికి వీధి వీధినా మండపాలు ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటుచేసే మండపాల నుంచి డబ్బుల వసూళ్లు ప్రారంభించారు. ఎన్ని స్పీకర్స్ పెట్టుకుంటే అన్ని వందలు కట్టాలని… ఒక్కో మండపానికి రూ. వెయ్యి వరకూ ఫీజుచెల్లించాలని.. నిబంధనలు విధించారు. ఎలా చూసినా.. ఒక్కో మండపం నుంచి ఐదారు వేలు వివిధ రకాల ఫీజులతో వసూలు చేసేలా రూల్స్ పెట్టారు. వీటిని చూసి పందిళ్లు ఏర్పాట్లు చేద్దామనుకునేవారికి మైండ్ బ్లాంక్ అయింది.

గణేష్ ఉత్సవాలను అందరూ చందాలు వేసుకుని నిర్వహిస్తున్నారు. అలాంటి చందాల నుంచి ప్రభుత్వం కొంత వాటా తీసుకునే ప్రయత్నం చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. చివరికి బీజేపీ నేతలు కూడా ఈ అంశంలోకి రంగంలోకి దిగారు. ఇలా ఫీజులు వసూలు చేయడం కరెక్ట్ కాదని నేరుగా ప్రభుత్వానికే లేఖలు రాశారు. ఫీజులు వసూలు చేయటం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం హిందూ ధర్మంపై గౌరవం లేదని సోము వీర్రాజు అంటున్ారు. హిందువుల పండగలపై బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందన్నారు. పూజకు ఫీజులా ? అని ప్రశ్నించారు.

గతేడాది వినాయక చవితి ఉత్సవాలను కరోనా పేరుతో నిలువురించే ప్రయత్నం చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. బీజేపీ ఆందోళనలతో దిగి వచ్చింది. మండపాలకు సింగల్ విండో సిస్టం ద్వారా, ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా అనుమతులను వెంటనే మంజూరు చేయాలని బీజేపీ నేతలంటున్నారు. ప్రభుత్వం తీరు చూసి ప్రజలు కూడా అసహ్యంతో కూడిన జాలిని ప్రదర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ప్రతీ దానికి డబ్బులు వసూలు చేయడం కట్టకపోతే బెదిరింపులకు పాల్పడటం ఏమిటన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close