ఏం చేసినా .. ఇక అంతే.. ఉద్యోగులకు తేల్చి చెప్పిన ఏపీ సర్కార్ !

కరోనా వచ్చింది.. ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చింది..ఆదాయం పడిపోయింది. ఈ కారణంగా ఉద్యోగుల జీతాలు అంతకు మించి ఇవ్వలేం. ఇదీ ఉద్యోగుల ఆందోళనలకు సిద్ధమవుతున్న సమయంలో ప్రభుత్వం సూటిగా.. సుత్తి లేకుండా పంపిన సందేశం. సీఎస్ సమీర్ శర్మతో పాటు ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి.. చెప్పాలనుకున్నది మూడు ముక్కల్లో చెప్పేశారు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నదని.. ఖర్చులను ఆదాయాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

అందుకే అన్ని రకాలుగా ఆలోచించి న తర్వాతనే పీఆర్సీ ప్రకటించారు. మధ్యంతర భృతి కన్నా.. ఐఆర్ తక్కువగా ఇవ్వడంపై సీఎస్ భిన్నంగా స్పందించారు. ఐఆర్‌ జీతంలో భాగంగా చెప్పలేమన్నారు. అంత కంటే ఎక్కువ ఇవ్వాలన్న రూలేం లేదన్నారు. అయితే ఎన్ని బెనిఫిట్స్ కట్ చేసినా.. జీతం మాత్రం తగ్గబోదని సీఎస్ హామీ ఇచ్చారు. గ్రాస్ శాలరీ తగ్గకుండా చూస్తామన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ కూడా ఇంచుమించు ఇదే చెప్పారు. ఓ కుటుంబంలో ఆదాయఖర్చులు ఎలా చూసుకుంటారో.. ప్రభుత్వం కూడా అలాగే చూసుకోవాల్సి ఉందని.. జీతభత్యాల ఖర్చులు పరిధి దాటిపోయాయన్నారు.

అందుకే పరిమితంగా ప్రయోజనాలు కల్పించాల్సి వచ్చిందన్నారు. గతంతో పోలిస్తే ఆదాయం పడిపోయిందన్నారు. కరోనా కష్టకాలంలోనూ రూ. పదిహేడు వేల కోట్ల ఐఆర్ ఇచ్చామన్నారు. మొత్తంగా ప్రభుత్వం స్పష్టమైన సంకేతాన్ని పంపింది.. ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్‌ఆర్‌ఏను మళ్లీ సాధారణ స్థితికి తేవడం కానీ.. ఫిట్మెంట్‌ను మార్చడం కానీ చేసేది లేదని తేల్చేసింది. ఇక ఏం చేయాలో ఉద్యోగుల చేతుల్లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close