యాభై వేల మందికే ప్రొబేషన్ – మిగతా వారందరికీ షాకే!

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అడ్డగోలుగా షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. జూన్ లో ప్రొబేషన్ ఇచ్చి జూలై ఒకటో తేదీ నుంచి పర్మినెట్ అయిన ఉద్యోగికి వచ్చే జీతం ఇస్తామని ప్రకటించింది. అయితే ఇప్పుడు అందర్నీ పర్మినెంట్ చేయడం లేదు. రెండేళ్లకు పర్మినెంట్ చేస్తామని చెప్పి… మూడేళ్లకు కాస్త ముందుగా ఆ పని చేస్తున్న ప్రభుత్వం అందరికీ అలా చేయడం లేదు. పరీక్షలు పెట్టి ఫెయిలయ్యారని చెప్పి రెండొంతుల మందికి పర్మినెంట్ చేయడం లేదు. బహుశా… ఒక సామాజికవర్గం వారినే పర్మినెంట్ చేస్తారేమో కానీ.. యాభై వేల మందికి మాత్రమే పర్మినెంట్ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. రూ. లక్షా 27వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.

కానీ అందరికీ పరీక్షలు పెట్టే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. రెండేళ్లకు పర్మినెంట్ చేస్తామని రాసిచ్చారు. కానీ రెండేళ్ల తర్వాత పరీక్షల పేరుతో అందర్నీ వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అని సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కూడా వదులుకుని వచ్చిన వారున్నారు. వారందరి జీవితాలు ఇప్పుడు రిస్క్‌లో పడిపోయాయి. ఇప్పుడు పర్మినెంట్ చేయకపోతే ఇంకెప్పుడూ చేయరని వారు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఉద్యోగ సంఘాల నేతలు కూడా నోరెత్తడం లేదు.

నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టడమే కాదు.. ఇప్పుడు ఫెయిలయ్యారని ఆపేయడం ఏమిటని వాదిస్తున్నారు. కానీ ఉద్యోగ సంఘ నేతలు కూడా వారి గోడును పట్టించుకోవడం లేదు. అసలు ప్రొబేషన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే.. కొంది మందికి ఇచ్చి కొంత మందికి ఇవ్వకపోతే బాగోదు.. అందరికీ ఒకేసారి ఇవ్వడానికే జూలైలో ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. తీరా చూస్తే.. జూలైలోనూ.. సగం కన్నా తక్కువ మందికే ప్రొబేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close