పోలవరం కాంట్రాక్టులపై మళ్లీ హైకోర్టును లైట్ తీసుకున్న ఏపీ సర్కార్..!

మంత్రివర్గ సమావేశంలో.. చాలా రత్నాలను.. ప్రజలకు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు కొన్ని రద్దు నిర్ణయాలు తీసుకుంది. మచిలీపట్నం పోర్టు .. ఇతర కొన్ని ఒప్పందాలను రద్దు చేసింది. అనూహ్యంగా ఈ జాబితాలో పోలవరం హెడ్ వర్క్స్, విద్యుత్ ప్లాంట్ టెండంర్లు కూడా ఉన్నాయి. ఇదే.. చాలా మంది మంత్రుల్ని.. అధికారుల్ని కూడా ఆశ్చర్య పరిచింది. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయేమోనని.. పలువురు మంమత్రులు, అధికారులు ముఖ్యమంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం అలాంటి సమస్యలు రావని చెప్పి.. రాటిఫై చేయించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

పోలవరం పై రివర్స్ టెండరింగ్, హెడ్ వర్క్స్ నిర్మాణ బాధ్యత, హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నవయుగను తప్పించింది. దీనిపై నవయుగ ఇప్పటికే హైకోర్టుకు వెళ్లింది. హైడల్ ప్రాజెక్టు పై జెన్ కో ఇచ్చిన రద్దు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసి రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లవద్దని ఆదేశించింది. వీటిపై నిలుపుదల ఉత్తర్వులను నిలిపివేయాల్సిందిగా డివిజనల్ బెంచ్ కే అప్పీల్ చేసింది. కానీ ఇంకా ప్రభుత్వానికి ఊరట లభించలేదు. విచారణ జరగాల్సి ఉంది. ఈ తరుణంలోనే మంత్రివర్గంలో రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించేందుకు ఎజెండాలో చేర్చారు. కోర్టులో వివాదం ఉన్న సమయంలో ఈ అంశాన్ని క్యాబినేట్ లో చర్చించడం మంచిది కాదని కొంతమంది సూచించారు.

అయితే ఇది ప్రభుత్వం పాలనాపరంగా తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గంలో ఆమోదించడం వరకేనని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు అంశం కోర్టులో ఉండగా ఎలా నిర్ణయం తీసుకుంటారని మీడియా నేరుగానే… మంత్రివర్గ సమావేశ వివరాలు చెప్పిన.. మంత్రి పేర్ని నానిని అడిగింది. అయితే.. నాని మాత్రం… దీనిపై సూటిగా.. సమాధానం ఇవ్వకుండా.. చట్టవిరుద్దంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోదని, కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు. మరో వైపు ఈ వివాదం.. అధికారవర్గాల్లోనూ గందరగోళం రేపుతోంది. ముఖ్యమంత్రికి తప్పుడు న్యాయసలహాలు వెళ్తున్నాయన్న అభిప్రాయంలో కొంత మంది ఉన్నారు. ఈ వ్యవహారం చివరికి.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే.. రివర్స్ టెండరింగ్ పై ముందుకెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి టెండర్లను అప్ లోడ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close