ఏపీలో విస్తరిస్తున్న e-పాలన

శరవేగంగా మారిపోతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందు ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో చిన్నగా మొదలైన e పాలన ఊపందుకుంటోంది. e(ఎలక్ట్రానిక్) పాలనలో ప్రజలు తెలుసుకోవలసిన సమాచారానికి # (హాష్ టాగ్) ని కూడా జోడిస్తే ఇంటర్ నెట్ పరిజ్ఞానమున్న వారు టాబ్లెట్ పిసిలు, ఫోబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ లలో కూడా గవర్నమెంటుని చూడవచ్చు, అర్ధంచేసుకోవచ్చు, నిలదీయవచ్చు. అయితే ఆధార్ కార్డ్ తో అనుసంధానం కాకపోతే eప్రభుత్వం లోకి వెళ్ళడానికి గేట్ పాస్ దొరకదు. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ- ఆఫీస్ దేశ పరిపాలనా రంగంలోనే విప్లవాత్మకమైన పరిణామానికి నాంది పలికింది. పారదర్శకతతో కూడిన సుపరిపాలనను అందించడమేగాక, ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టడానికి సాంకేతికత తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ , రేషన్ పంపిణీ, గ్యాస్ సరఫరా, విద్యుత్ వంటి పథకాలకు ఆధునికతను జోడించింది. ఆన్ లైన్ పరిజ్ఞానాన్ని అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించింది.

ఎలక్ట్రానిక్ కార్యాలయం

ఎలక్ట్రానిక్ కార్యాలయం అమలులో భాగంగా ఫైళ్ళ నిర్వహణను ఆన్ లైన్ లోనే చేపట్టనున్నారు. ఫైళ్ళ తయారీతో పాటు ప్రాసెసింగ్, డిజిటల్ సంతకం సాయంతోనే చివరికి ఫైల్ను ఆమోదించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు సైతం ఆన్ లైన్ లోనే నిర్వహించేలా ఈ- ఆఫీస్ సాఫ్ట్ వేర్ సిద్ధం చేశారు. కేవలం ఇ (ఎలకా్ట్రనిక్) మెయిల్ వినియోగం గురించి తెలిసేవారికి ఈ- ఆఫీస్ ని వినియోగించడం చాలా తేలికని అధికారులు తెలిపారు. తొలుత 10 ప్రభుత్వ శాఖల్లో ఈ కార్యాలయాన్ని అమల్లోకి తీసుకువస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం కూడా ఇందులో ఉంది. అలాగే కీలకమైన ఆర్థిక శాఖతో పాటు సంక్షేమ శాఖలైన సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీలను ఆన్ లైన్ చేశారు. న్యాయశాఖ, గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, వ్యవసాయంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ ఆన్ లైన్ వ్యవస్థ అమలవుతుంది. ఆన్ లైన్ కార్యాలయ వ్యవస్థలో మొత్తం ఆరు విభాగాలుంటాయి. అందులో భాగంగా ఈ-ఫైల్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, ఈ- లీవ్, ఈ- టూర్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, కొలబ్రేషన్స్ అండ్ మెసెజింగ్ సర్వీసెస్ ఉంటాయి

ఈ-ఫైల్: అన్ని ఫైళ్ళను వరుస క్రమంగా నిర్వహిస్తుంది. సంబంధిత ఉద్యోగులు, అధికారులు అందరికీ అందుబాటులో ఉండేలా ఈ విధానం పని చేస్తుంది.

నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టం (కేఎంఎస్): నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టం అనేది కేంద్రీకృత సమాచార వ్యవస్థగా పనిచేస్తుంది.చట్టాలు, విధానాలు, మార్గదర్శకాలు వంటి ప్రతి అంశం నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టంలో పొందుపరచడం జరుగుతుంది.

సెలవు నిర్వహణ విధానం (ఈ-లీవ్): ఉద్యోగుల సెలవులకు సంబంధించిన వివరాలన్నీ దీనిలో నమోదవుతాయి. సెలవు దరఖాస్తు, మంజూరు వంటి ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు నమోదు చేయడం జరుగుతుంది.

ఎలకా్ట్రనిక్ టూర్ మేనేజ్మెంట్ సిస్టం (ఈ- టూర్): విధి నిర్వహణలో భాగంగా సంబంధిత శాఖల్లోని అధికారులు, ఇతర సిబ్బంది ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారో ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. అలాగే పర్యటన సందర్భంగా ఎదురైన విషయాలను నమోదు చేయడం జరుగుతుంది.

పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం (పీఐఎంఎస్ ): ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు పీ ఐ ఎం ఎస్లో నమోదు చేయడం జరుగుతుంది. అలాగే రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి నిల్వ చేస్తారు.

కొలబ్రేషన్ అండ్ మెసేజింగ్ సర్వీసెస్ (సీఎఎంఎస్): సంబంధిత శాఖలో పరస్పర సమాచారం చేరవేతకు సీ ఎఎంఎస్ సర్వీసును వినియోగిస్తారు. సందేశాల చేరవేతతో పాటు ఉద్యోగుల పే స్లిప్పులు, జీపీఎఫ్, ఇన్ కమ్ ట్యాక్స్ వంటివన్ని ఈ- సేవల్లో ఉంటాయి.

సెంట్రలైజ్డ్ సర్వీస్: ఎలక్ట్రానిక్ కార్యాలయానికి సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర సర్వర్లో నిక్షిప్తమై ఉంటుంది. అధికారులు ఎక్కడినుంచైనా వాటిని పరిశీలించవచ్చు. అలాగే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి పర్యటనల్లో ఎవరైనా అర్హులకు మేలు చేయాలనుకుంటే అక్కడికక్కడే తక్షణ నిర్ణయం తీసుకోవచ్చు. అనర్హులను సైతం ఎక్కడికక్కడే గుర్తించవచ్చు. సంబంధిత సమాచారం అత్యంత భద్రంగా ఉండటానికి పలు రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. అధికారులకు ప్రత్యేక కోడ్ తో పాటు వేలిముద్రలు, కనుపాపల ఆధారాలు తీసుకున్న తర్వాతే కంప్యూటర్ తెరుచుకుంటుంది. దీనితో చిన్నపాటి తేడా కూడా వచ్చేందుకు అవకాశం లేదు. అలాగే డిజిటల్ సంతకాలు సైతం దుర్వినియోగమయ్యే అవకాశం ఏమాత్రం లేదు. ప్రస్తుతం దాదాపు అన్ని ఫైళ్ళను కంప్యూటరీకరించారు.

ఈ- ఆఫీస్ ప్రయోజనాలు: e పాలన నిస్సందేహంగా పారదర్శకతను పెంచుతుంది. ఫైళ్ళ కదలికలో రెడ్ టేపిజాన్ని అరికడుతుంది. ప్రజలు ‘కష్టమర్లయ్యే’ సందర్భాలలో లోపల ఏంజరుగుతూందో తెలుసుకోడాని వారు ఇపాలనలో ఇంటరాక్టు కావలసి వుంది అందుకు వారి డేటా సర్వర్లకు అవసరమౌతుంది. ఆధార్ కార్డే ఇందుకు ఆధారమౌతుంది.

ఎలక్ట్రానిక్ కార్యాలయంతో బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యేకించి పౌరులకు వేగవంతమైన పారదర్శ కమైన సేవలు లభ్యమవుతాయి. పని సామర్థ్యం మెరుగవడంతో పాటు నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. క్లౌడ్ సర్వీస్ తో ఉద్యోగులు ఎక్కడి నుంచైనా పనిచేసుకునే అవకాశం ఉంది. డిజిటల్ సంతకం వినియోగంతో ఫైళ్ళ ట్యాంపరింగ్ కిఏమాత్రం అవకాశం ఉండదు. సంబంధిత శాఖల్లోని అధికారులు ఎన్ని గంటలు పనిచేశారో తెలుసుకోవడంతో పాటు ఎన్ని ఫైళ్ళను క్లియర్ చేశారనేది తెలుకోవచ్చు. నోట్ ఫైల్లోని అంశాలకు సంబంధించిన జీవోల ప్రతులు, ఆర్టికల్స్ నువాటితో పాటే అనుసంధానించగలిగితే అన్ని స్పష్టంగా చూసుకునే అవకాశం ఉంటుంది.

‘గ్రామం మొదలుకుని సచివాలయం వరకూ ప్రతి దశలోనూ ‘ఈ-కార్యాలయం’ విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పెరుగుతుంది. దస్త్రాలు వేగంగా పరిష్కారమవుతాయి. ఏ అధికారైనా తన శాఖకు సంబంధించిన దస్త్రాలను ఎక్కడి నుంచైనా పరిష్కరించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం పది శాఖల్లో ఈ విధానం ప్రారంభమవ్వడం శుభపరిణమం. మిగతా శాఖల్లో కూడా వీలైనంత వేగంగా ఈ విధానాన్ని ప్రారంభించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close