బైజూస్‌ కోసం టీచర్లపై ప్రభుత్వం దండయాత్ర !

బైజూస్ కంటెంట్‌ను ఎలాగైనా విద్యార్థులకు అంటగట్టాలని గట్టి ప్రయత్నంతో ఉన్న ప్రభుత్వం టీచర్లను వేధించడానికి కూడా వెనుకాడటం లేదు. జైజూస్ ఇస్తామన్న ట్యాబ్‌లు ఇవ్వలేదు. నెలలకు నెలలు గడిచిపోతున్నాయి. కానీ పిల్లల స్మార్ట్ ఫోన్లలోనే బైజూస్‌ను డౌన్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఎక్కడ నుంచి వస్తాయన్న కనీస ఆలోచన చేయలేదు. వారి తల్లిదం‌డ్రుల ఫోన్లలో అయినా డౌన్ లోడ్ చేయాల్సిందేనని ఆదేశాలిచ్చింది. ఈ బాధ్యత టీచర్లకు ఇచ్చింది.

కానీ ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారంతా.. స్మార్ట్ ఫోన్లు వాడతారన్న గ్యారంటీ లేదు. ఫోన్ ఉన్నా డేటా ఉంటుందన్న గ్యారంటీలేదు. ఇలాంటి పరిస్థితుల కారణంగా విద్యార్థుల ఫోన్ నెంబర్లను టీచర్లు రిజిస్టర్ చేయలేకపోయారు. ఇదే అదనుగా.. టీచర్లందరిపై ప్రభుత్వం దండయాత్ర ప్రారంభించింది. బైజూస్ యాప్ డౌన్ లోడ్ కోసం.. ఫోన్ నెంబర్లు సేకరించలేదన్న కారణంగా వందల మంది టీచర్లకు నోటీసులు జారీ చేసింది. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకోకుండా ఇలా టీచర్లపై ప్రతీ దానికి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేయడం ఏమిటన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.

ప్రభుత్వం రూ. ఐదు వందల కోట్లకుపైగా బైజూస్‌కు కట్టాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం ట్యాబ్‌లు వస్తాయని ప్రకటించారు. మొదట అమ్మఒడికి బదులు ల్యాప్ ట్యాప్ ఇస్తామన్నారు.. తర్వాత అదీ లేదు. తర్వాత ఉచితంగా బైజూస్ ట్యాబ్ అన్నారు. ఇప్పుడు ఇంకా దారుణంగా విద్యార్థుల సొంత ఫోన్లలోనే బైజూస్ ఉండాలంటున్నారు. ట్యాబ్‌ల గురించి మాట్లాడటం లేదు. అసలు టీచర్లు ఎప్పటిలాగే పాఠాలు చెబుతూంటే.. బైజూస్ కంటెంట్ ఎందుకని వస్తున్న ప్రశ్నలకూ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close