6గంటలకో పారాసిటమాల్..! ఏపీ సర్కార్ సలహా.. !

కరోనాకు చికిత్స విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్లీచింగ్, పారాసిటమాల్ వదిలిన బ్లూఫర్‌.. సోషల్ మీడియాను దున్నిపడేస్తోంది. అయితే. అది బ్లూఫర్ కాదని.. నిజమేనని నిరూపించేందుకు వైసీపీ సోషల్ మీడియా నానా తంటాలు పడుతోంది. అన్ని చోట్లా చల్లుతున్న ద్రావణాన్ని బ్లీచింగ్ అని చూపిస్తూ.. జగన్ అదే చెబుతున్నారంటున్నారు. అదే సమయంలో.. కొంత మంది డాక్టర్లు.. కరోనాకు పారాసిటమాల్‌నే ప్రిఫర్ చేస్తున్నారంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు. దీనికి… ఉన్నతాధికాలు కూడా అతీతం కాదు. ఏపీలో కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో చెప్పడానికి మీడియా ముందుకు వచ్చిన పీవీ రమేష్ అనే అధికారి …కరోనా లక్షణాలు ఉన్నాయనుకున్న వారందరూ.. ఆరు గంటలకో పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలని సూచించారు.

జ్వరం, దగ్గు వచ్చినవారందరికీ కరోనా వచ్చినట్లుగా కాదని.. అందరూ చెందాల్సిన అవసరం లేదని.. అలాంటి లక్షణాలు ఉన్న వారు ఆరు గంటలకు ఒకసారి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని ప్రెస్‌మీట్‌లో ప్రిస్కిప్షన్ ఇచ్చేశారు. తీవ్రమైన జ్వరం వస్తేనే ఆస్పత్రికి వెళ్లాలని సలహా ఇచ్చారు. కరోనా లక్షణాలతో వచ్చే అనారోగ్యాన్ని పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లు దాచి పెడతాయని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనాతో జ్వరం వస్తే.. జ్వరానికి టాబ్లెట్ వేసుకుంటే జ్వరం కంట్రోల్ అవుతుందేమో కానీ…కరోనా కాదని..చెబుతున్నారు. అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారాసిటమాల్ వాడమన్నారు కాబట్టి.. వేరేది చెబితే.. ఆయన ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందని అనుకుంటున్నారేమో…కానీ పారాసిటమాల్ వాదనను.. బలంగానే వినిపిస్తున్నారు..

వైసీపీ నేతలు… సర్కార్ పెద్దలకు అత్యంత సన్నిహితమైన అధికారులు ఈ బాధ్యత తీసుకున్నారు. దీని వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడటం…ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మినహా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పటికే బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ యంత్రాంగం తమ వాదనలతో మరింతగా అభాసు పాలవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close