అవి ఇళ్ల పట్టాలా..? పొజిషన్ సర్టిఫికెట్లా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేస్తున్న ఇళ్ల పట్టాలపై దుమారం రేగుతోంది. అసలు అవి ఇళ్ల పట్టాలా..? పొజిషన్ సర్టిఫికెట్లా..? అన్న చర్చ కూడా ప్రారంభమయింది. ప్రభుత్వం ముఫ్పై లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలిస్తున్నామని ప్రకటించి.. పంపిణీని ప్రారంభించింది. అయితే చాలా చోట్ల దీనికి సంబంధించి ఇస్తున్న పత్రాలపై లబ్దిదారులే అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. కొన్నికొన్ని చోట్ల.. ఊరు, పేరు లేకుండా… ఖాళీ డాక్యుమెంట్లను లబ్దిదారుల చేతుల్లో పెడుతున్నారు. మరికొన్ని చోట్ల అసలు స్థలం ఎక్కడుందో చెప్పకుండా.. ఒక సెంటు ఇస్తున్నట్లుగా రాసి ఇస్తున్నారు. దీంతో లబ్దిదారుల్లో సందేహాలు ప్రారంభమయ్యాయి. వీరిలో ఏ మాత్రం సందేహం వచ్చినా విపక్షాలు దాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి సహజంగానే రంగంలోకి దిగాయి.

ఏపీ ప్రభుత్వం తాము ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న 30 లక్షల ఇళ్ల పట్టాల్లో కేవలం20 శాతం మాత్రమే నిజమైన డి-పట్టాలని మిగిలిన ఎనభై శాతం. పొజిషన్ సర్టిఫికెట్లని టీడీపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. పొజిషన్ సర్టిఫికెట్లు అంటే.. స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం లాంటిదే.స్థలం ఎక్కడ ఉంది.. ఎలాఉంది.. ఎప్పుడు స్వాధీనం చేస్తారు లాంటి వివరాలేమీ ఉండవు. ప్రస్తుతం.. లబ్దిదారుల సమావేశాలు పెట్టి.. ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అత్యధికులకు స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించలేకపోతున్నారు. దాంతో సమస్య వస్తోంది.

నిజానికి ప్రభుత్వం కూడా… ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పట్టాలివ్వాలనుకోలేదు. అంటే డి-పట్టాలు ఇవ్వాలనుకోలేదు. నేరుగా లబ్దిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలనుకుంది. ఇందు కోసం కన్వేయన్స్ డీడ్‌లను రెడీ చేసుకుంది. కానీ..ప్రభుత్వ భూముల్ని ఇలా అప్పనంగా.. రిజిస్ట్రేషన్ చేయడం అసైన్డ్ చట్టానికి వ్యతిరేకం. అలా చేయాలంటే.. కేంద్రమేఅసైన్డ్ చట్టాన్ని మార్చాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. దీంతో కేసులు పడ్డాయి.ఆ కన్వేయన్స్ డీడ్‌ల ద్వారా పంపిణీ చేయలేకపోయారు.

ప్రభుత్వంపై ఇప్పటికే అన్ని ఫేక్ అనే విమర్శలతో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు.. ఇళ్ల పట్టాలను కూడా.. టీడీపీ నేతలు ఫేక్ అని చెప్పడం ప్రారంభించారు. తాము పంపిణీ చేస్తున్నవి వర్జినల్ డీ పట్టాలని .. పొజిషన్ సర్టిఫికెట్లు కాదని ప్రభుత్వం నిరూపించాల్సి ఉంది.ఆ పట్టాలు పనికి రావని లబ్దిదారులు కూడా నమ్మితే మొదటికే మోసం వస్తుంది.అందుకే.. ఫేక్ పట్టాలు పంచుతున్నారన్న విపక్షాల ప్రచారానికి గట్టి కౌంటర్ ఇవ్వడానికి ఆదివారం మంత్రులందరూ తెరముందుకు వచ్చారు. తమదైన శైలిలో టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close