“ఇన్‌సైడర్ తీర్పు” పై సుప్రీంకోర్టుకు..!

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి సహజంగానే షాక్ ఇచ్చింది. ఎంతగా ప్రయత్నిస్తున్నా.. అనుకూల తీర్పులు రాకపోతూండటంతో పై స్థాయిలో తేల్చుకోవాలని నిర్ణయిస్తున్నారు. తాజాగా ఈ తీర్పుపైనా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే.. హైకోర్టులోనే డివిజన్ బెంచ్‌కు వెళ్దామా.. లేక సుప్రీంకు వెళ్దామా అన్న ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. కానీ సీబీఐ ఇంత వరకూ పరిశీలించలేదు. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా దాని గురించి ప్రస్తావిస్తూ ఉంటారని చెబుతారు. అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది స్టాక్‌మార్కెట్‌కు సంబంధించిన అంశమని.. అసలు ఆ పదమే భారత శిక్షా స్పృతిలో లేదని హైకోర్టు తేల్చేయడంతో ఇప్పుడు సీబీఐ కూడా ముందడుగు వేయలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

అందుకే తీర్పు విషయంలో సుప్రీంకోర్ట్ లో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే హైకోర్టు తీర్పును.. ఓ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో క్షుణ్ణంగా పరిశీలింప చేస్తున్నారు. ప్రభుత్వానికి అనధికారిక న్యాయసలహాదారుగా ఆయన వ్యవహారిస్తున్నారు. మొత్తంగా కీలకమైన వ్యవహారాలు అన్నీ ఆయన చేతుల మీదుగానే నడుపుతున్నారు. ఇప్పుడు ఆయన ఏ ఏ పాయింట్లను లీడ్‌గా తీసుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాలో గైడ్ చేయబోతున్నారు. ఆయన ఇచ్చే పాయింట్లను ఆధారంగా చేసుకుని సాంకేతిక అంశాల ఆధారంగా అయినా… హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై స్టే తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

ఏ క్షణమైనా సుప్రీంకోర్టులో ఈ మేరకు పిటిషన్ వేస్తారని చెబుతున్నారు. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే కేసులే లేకపోతే… అమరావతిలో అవినీతి అనేదే ఉండదు. ఇప్పుడు అలాంటికేసులు పెట్టడానికి కూడా చాన్స్ ఉండదు. దీంతో వైసీపీ సర్కార్… అవినీతి ఆరోపణలు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అందుకే తీర్పుపై స్టే కోసం… అటు హైకోర్టు డివిజన్ బెంచ్ అయినా.. ఇటు.. సుప్రీంకోర్టు అయినా సరే… తీవ్రంగా ప్రయత్నించాలని నిర్ణయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close