ఆ ముగ్గురు టీడీపీ నేతల అరెస్టులపై స్టే..!

వివిధ రకాల కేసులు మోపబడిన టీడీపీ నేతలు తాత్కాలికంగా అరెస్ట్ ముప్పును తప్పించుకున్నారు. ముఖ్యంగా నిర్భయ కేసు నమోదైన అయ్యన్నపాత్రుడుని.. ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంలో పోలీసులు నిన్నటి నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే.. ఆయన ఎక్కడ ఉన్నారో పోలీసులకు అంతుపట్టలేదు. ఈ లోపు.. ఆయన దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. అది రాజకీయ కక్ష సాధింపు పిటిషన్ అని.. కేసులు కొట్టి వేయాలని అయ్యన్న పాత్రుడు హైకోర్టును కోరారు. తప్పుడు కేసులు పెట్టాలని అసలు అయ్యన్న కేసు నిర్భయ చట్టం కిందకు రాదని.. ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. అయితే.. అది నిర్భయ చట్టం కిందకు వస్తుందని.. గతంలో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు.

ఆ జడ్జిమెంట్లను చూపించాలని… ధర్మాసనం కోరింది. రెండు రోజుల సమయం ఇచ్చింది. రెండు రోజుల వరకూ.. అయ్యన్నపాత్రుడు అరెస్ట్ పై స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు అయ్యన్నపాత్రుడు అన్నాడో లేదో తెలియని వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో చూసి తాను ఫిర్యాదు చేశానన్న అధికారిణి ఫిర్యాదు .. నిర్భయ చట్టం కిందకు వస్తాయని.. ఆ మేరకు గతంమలో కోర్టులు తీర్పులు చెప్పాలని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వ న్యాయవాదులపై పడింది. అలాగే.. ఓ పార్టీ నేత పెళ్లికి వెళ్లిన యనమల రామకృష్ణుడు, చినరాజప్పల అరెస్టుపైనా హైకోర్టు స్టే విధించింది. వీరిది మరింత విచిత్రమైన కేసు. ఓ టీడీపీ నేత రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి వీరు హాజరయ్యారు. అయితే.. ఆయన మొదటి భార్య ఎస్సీ. పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు.

కానీ ఆమె తిరిగి ఆ టీడీపీ నేతపై కేసు పెట్టింది. పెళ్లికెళ్లిన చినరాజప్ప, యనమలలే దగ్గరుండి పెళ్లి చేయించారని.. కేసు నమోదు చేయించారు. దాంతో వారిపై అట్రాసిటీ కేసు పెట్టారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే లభించింది. పోలీసులు పెడుతున్న అనూహ్యమైన కేసుల్లో.. అరెస్టుల నుంచి తప్పించుకోవడనికి కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది టీడీపీ నేతలకు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close