ఎమ్మెల్సీలయిన ఇద్దరు మంత్రులు రాజీనామా..?

శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదించిన వెంటనే.. జగన్మోహన్ రెడ్డి .. నైతిక పరంగా విమర్శలు రాకుండా ఉండటానికి.. ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో.. పిల్లిసుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీలు. వీరికి గత ఎన్నికల్లో.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చినప్పటికీ.. విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ.. వెన్నంటే ఉన్నారన్న కారణంగా.. మంత్రి పదవులను జగన్ ఇచ్చారు. వీరిలో సుభాష్ చంద్రబోస్.. ముందు నుంచీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మోపిదేవిని.. మంత్రి పదవి అప్పగించిన తర్వాత శాసనమండలికి పంపించారు. ఎనిమిది నెలల కాలంలోనే వీరి మంత్రి పదవులకు గండం వచ్చి పడింది. నిజానికి శాసనమండలి అధికారికంగా రద్దయ్యే వరకూ.. వీరు మంత్రి పదవుల్లో కొనసాగడానికి అవకాశం ఉంది.

అసెంబ్లీ తీర్మానాన్ని లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదించి.. రాష్ట్రపతి నోటిఫికేషన్ ఆమోద ముద్ర వేసే వరకూ.. మండలి ఉనికిలో ఉంటుంది. కానీ స్వయంగా.. ప్రభుత్వమే.. మండలిని రద్దు చేయాలని తీర్మానం చేసిన తర్వాత.. ఆ మండలిలో సభ్యులను మంత్రులుగా కొనసాగించడం కరెక్ట్ కాదని.. జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీలో ..తీర్మానం ఆమోదించిన వెంటనే.. మంత్రులు రాజీనామా చేయాలని.. జగన్.. మంత్రివర్గ సమావేశంలో సూచించినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు వారు రాజీనామా చేయడం లాంఛనమే. మండలి రద్దును తాము స్వాగతిస్తున్నామంమటూ.. మంత్రులు స్వయంగా మండలిలో ప్రకటించారు కూడా.

అధికారికంగా ఈ విషయం బయటకు తెలియకపోయినప్పటికీ.. టీడీపీ నేత నారా లోకేష్ మాత్రం.. మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నందున.. మంత్రులతో పాటు.. మండలిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మండలి రద్దయ్యేలోపు జరగబోయే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకూడదని.. డిమాండ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల 'పుష్ష 2' గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే... మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం...

మారువేషంలో జగన్ దగ్గరే జడ్జిలపై దూషణల కేసు నిందితుడు !

హైకోర్టు న్యాయమూర్తులపై దూషణల కేసులో చాలా మంది విదేశాల్లో ఉన్న వైసీపీ సానుభూతిపరులపై కేసులు పెట్టారు. ఎక్కడో ఉన్నాను కదా.. తననేమీ పీకలేరన్నట్లుగా పోస్టులు పెట్టి, న్యాయమూర్తుల్ని బూతులు తిట్టిన వారిలో...

నిర్వాసితుల క‌న్నీటికి స‌మాధానం ఉందా…? బీఆర్ఎస్ అభ్య‌ర్థిపై వైర‌ల‌వుతోన్న పోస్ట్!

మా క‌న్నీటికి నీ ద‌గ్గ‌ర స‌మాధానం ఉందా? మ‌మ్మ‌ల్ని ముంచి నువ్వు తెచ్చుకున్న సీటులో గెల‌వ‌గ‌ల‌వా...? బ‌త‌కొచ్చినంత మాత్రాన నువ్వు లోక‌ల్ ఎట్లా అయిత‌వ్...? ఇలాంటి ప‌దునైన మాట‌ల‌తో మెద‌క్ బీఆర్ఎస్ అభ్య‌ర్థి,...

హైదరాబాద్‌లో డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు సహజం... కానీ తెలంగాణ పోలీసులు ఇంకో అడుగు ముందుకేశారు. ఏకంగా డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేయాలని నిర్ణియంచుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close