నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టిన తెదేపా

కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో నిన్న తునిలో బారీ బహిరంగ సభ నిర్వహిస్తారని, దానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. కానీ దానిని సరిగ్గా అంచనా వేయలేకపోయింది. అందుకే కొందరు తెదేపా నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొన్నటి వరకు సంజాయిషీలు, విమర్శలు చేస్తూ కాలక్షేపం చేసారు. రాష్ట్ర పోలీసులు, నిఘా వ్యవస్థ కూడా దీని గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిందో లేదో తెలియదు కానీ ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమయింది.

అపారమయిన రాజకీయ అనుభవం ఉన్న ముద్రగడ పద్మనాభం రాస్తా రోకో, రైల్ రోకోలకు అకస్మాత్తుగా పిలుపునిస్తే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో ఆయనకి తెలిసే ఉంటుంది. కానీ తన ఈ ఆలోచనను ముందే బయటపెడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్లు అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి ఉండవచ్చును. ఆ సంగతి ప్రభుత్వం, పోలీసులు పసిగట్టి లేకపోయుండవచ్చును కానీ ఆయన నిర్వహించతలబెట్టిన కాపు ఐక్య గర్జనకు వేలాదిగా ప్రజలు తరలి వస్తారనే విషయం ప్రభుత్వం ఊహించలేదంటే ఆశ్చర్యం కలుగుతోంది.

జరుగకూడనిది అంతా జరిగిపోయిన తరువాత ఇప్పుడు ప్రభుత్వం మేల్కొని, బారీగా పోలీస్ బలగాలను, డిల్లీ నుండి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని, అలాగే ఈ సంఘటనలని ఖండించడానికి తన మంత్రులను రంగంలోకి దింపింది. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తునిలో కర్ఫ్యూ విదించారు. పోలీస్ ఉన్నతాధికారులు జిల్లాకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైలుని పోలీస్ వాహనాలను తగలబెట్టిన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇంతవరకు 30మంది పై కేసులు నమోదు చేసారు.

మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి చైనా రాజప్ప, తెదేపా ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మొదలయిన వారు ముద్రగడ పద్మనాభాన్ని, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వివిధ కులాల రిజర్వేషన్లను ప్రభావితం చేసే ఈ అంశంపై చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవరికీ నష్టం, అన్యాయం జరుగకుండా సరయిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని అందుకే ప్రభుత్వం తన హామీకి కట్టుబడి కమీషన్ వేసిందని, దాని నివేదిక రావడానికి తొమ్మిది నెలలు పడుతుందని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకొంటామని అన్నారు. రెండు దశాబ్దాలు ఆగిన వాళ్ళు మరో తొమ్మిది నెలలు ఆగలేరా? అని మంత్రులు ముద్రగడ పద్మనాభాన్ని నేరుగా ప్రశ్నించారు.

ఆయన కోరుతున్నట్లుగానే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జి.ఓ. జారీ చేస్తే, తదనంతర పరిణామాలకు ఆయన బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. అయినా కోర్టులో నిలువని జీఓ.లు జారీ చేసి ప్రజలను మభ్యపెట్టడం తప్ప వేరే ప్రయోజనం ఏముంటుందని వారు ప్రశ్నించారు. ఇటువంటి ఉద్యమాలు చేసి ప్రజల మధ్య చిచ్చుపెట్టడం కంటే ఈ సమస్యని ఏవిధంగా పరిష్కరించవచ్చో సూచిస్తే బాగుండేది అని హితవు పలికారు. ముద్రగడ వంటి పెద్దమనిషి నేతృత్వంలో నిన్న జరిగిన సంఘటనల వలన సమాజంలో కాపు కులస్థుల గౌరవ ప్రతిష్టలు మంటగలిసాయని, మిగిలిన కులాల ప్రజలు కాపుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అందుకు కారణం ముద్రగడ పద్మనాభం ప్రదర్శించిన తొందరపాటే కారణమని వారు వాదించారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం చూస్తున్నారా… లేక దీనిపై రాజకీయం చేసి లబ్దిపొందుదామని చూస్తున్నారా? అని వారు నేరుగా ముద్రగడ పద్మనాభాన్ని ప్రశ్నించారు. దీనికి తమ పార్టీయే కారణమని ఆయన నిందించడాన్ని కూడా వారు తప్పు పట్టారు. మూడు దశాబ్దాలుగా పరిష్కారం కాని ఈ సమస్యను తమ ప్రభుత్వమే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే తిరిగి తమనే నిందించడం ఏమిటని వారు ప్రశ్నించారు.

బహుశః తెదేపాలో ఉన్న మిగిలిన కాపు నేతలు కూడా నేడో రేపో మీడియా ముందుకు వచ్చి నిన్నటి సభ గురించి, జరిగిన సంఘటనల గురించి మాట్లాడవచ్చును. దానికి ప్రతిపక్షాలు, ముద్రగడ పద్మనాభం కూడా దీటుగానే సమాధానాలు చెప్పవచ్చును. కానీ జరగకూడని నష్టం జరిగిపోయింది. అందుకు ఎవరు బాధ్యత వహించబోరని స్పష్టం అయిపోయింది. దీనిపై అన్ని పార్టీల నేతలు రాజకీయ చదరంగం ఆడుకొంటుంటే, వారి మాటలను నమ్మి అమాయకులయిన ప్రజలు బలయిపోతుంటారు. అయినా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా..అంటే అనుమానమే. ఎందుకంటే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటే ముందుగా బీసీలు అందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తరువాత అది కోర్టులో నిలిచే విదంగా ఉండాలి. ఈ సంగతి ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి, రాజకీయ పార్టీలు అన్నిటికీ తెలుసు. కానీ ఎవరి వాదనలు వారివే..ఎవరి గేమ్ వారిదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close