పోలీసులు రాజకీయాలు చేస్తే బాధితులకెవరు రక్షణ..!?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. దానికి కారణం సత్తెనపల్లిలో గ్యాంగ్ రేప్ చేశారంటూ వచ్చిన బాధితులను పోలీసులు తమ పరిధి కాదంటూ తిప్పి పంపడమే దీనికి కారణం. వారు ఆ మాటలన్నారని.. ఫిర్యాదు తీసుకోలేదని బాధితులు ఊరకనే చెప్పరు. పోలీసులపై వారికి పగేమీ ఉండదు. అసలే అన్యాయమైనపోయిన తమను పోలీసులు ఇంకా శల్యం చేశారన్న బాధతోనే చెప్పి ఉంటారు. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులు ఇంత దారుణంగా ఎలా వ్యవహరించగలుగుతున్నారు..?

పోలీసులు వారి పనుల్ని మానేసి రాజకీయ పనులు చేయడం పూర్తి స్థాయి వర్క్ షెడ్యూల్‌గా మార్చుకున్నప్పుడే పరిస్థితి మారిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏ పోలీస్ స్టేషన్‌లో చూసినా రాజకీయ పలుకుబడితో తెచ్చుకున్న పోస్టింగ్‌లే కనిపిస్తూంటాయి. గతంలో ఓ వర్గం వారే డీఎస్పీలు అనిఆరోపణలు చేసేవాళ్లు కానీ ఇప్పుడు ఎక్కడ ఏ నేరం జరిగినా.. కేసు వివరాలు వెల్లడించే డీఎస్పీలను చూస్తే అందరూ ఒకే వర్గం ఉన్నారేంటి అని ముక్కున వేలేసుకోక తప్పని పరిస్థితి. ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థలో ఆశ్రిత పక్షపాతం పాతుకుపోయిన తర్వాత ప్రజలకు సేవలు అందుతాయని చెప్పడం అత్యాశే అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో రూల్ ఆఫ్ లా గురించి హైకోర్టు ఎన్నో సార్లు హెచ్చరించింది. సాక్షాత్తూ డీజీపీ హైకోర్టు ఎదుట హాజరు కావాల్సి వస్తోంది. కానీ పోలీసులు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేస్తున్నారు . తాము అధికారపక్షం అని సాక్షాత్తూ డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి చెబుతున్నారు. ప్రతిపక్షాలు రాజకీయ గోల చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఓ ఎస్పీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబున హెచ్చరిస్తున్నట్లుగా లేఖ రాస్తున్నారు. ఇలాంటి పోలీసులు వ్యవస్థలో భాగమైనప్పుడు బాధితులకు మేలు జరుగుతుందని అంచనా వేయడం కష్టం.

ఏపీలో నేరస్తులకు అసలు భయమేనేదే లేకుండా పోయిందనేది బహిరంగసత్యం. తాము అత్యాచారం చేస్తే.. హత్య చేస్తే ప్రభుత్వం వారికి పరిహారం ఇస్తుంది..తాము సేఫ్ అన్న ఆలోచనకు నిందితులు వస్తున్నారు. ఫలితంగా నేరాలు అంతకంతకూ పెరుగతున్నాయి. బాధితులకు ఆర్థిక సాయం చేసి న్యాయం చేశామని పోలీసులు కూడా అనుకుంటున్నారంటే వారి మైండ్ సెట్ ఎంత దారుణంగా మారిపోయిందో ఊహించడం సులువే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close