మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..!?

గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు దౌర్జన్యాలు, దాడులతో పాటు పోలీసులు ప్రమేయం వల్ల జరిగాయని .. ఇది ప్రజాస్వామ్యాన్ని పాతరేయడమేనని విపక్షాలు ఆరోపణలు చేశాయి. అవంటే గ్రామాలు అనుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితిని పట్టణాలకు కూడా తీసుకు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వైసీపీ తెగ ఆరాటపడుతోంది. అందు కోసం పోలీసుల్నే ప్రయోగిస్తోంది. అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి ఇళ్లకు పోలీసులు వెళ్లి రచ్చ చేస్తున్నారు. అభ్యర్థిత్వం ఉపసంహరించుకోవాలని నేరుగా చెప్పారు. ముందుగా పోలీసులు భయపెట్టి వెళ్తారు. లేదా పాత కేసుల్లోనో….కొత్త ఫిర్యాదులు వచ్చాయనో.. అభ్యర్థినో వారి కుటుంబసభ్యులనో పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తారు.

పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత వైసీపీ నేతలు రంగంలోకి దిగుతారు. కేసుల్లేకుండా చూస్తామని పోటీ నుంచి విరమించుకోవాలని బేరం మాట్లాడుకుంటారు. ఈ పరిస్థితి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్నింటిలోనూ జరుగుతోంది. పోలీసుల తీరుపై తీవ్రమైన ఆరోపణలు వస్తూండటంతో తిరుపతిలో.. నిమ్మగడ్డ ర మేష్ కుమార్ కూడా స్పందించారు. ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన అభ్యర్థుల్ని, బంధువుల్ని పీఎస్‌కు పిలవకూడదుని ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి బెదిరించడం జరగకూడదన్నారు. అయితే ఆయన ఆదేశాలు అమలు కావడం కష్టమే. ఇప్పటికే పోలీసుల సౌజన్యంతో పెద్ద ఎత్తున ఇతర పార్టీల అభ్యర్థుల వద్ద నుంచి ఉపసంహరణ లెటర్లు తీసుకున్నారని.. చివరి రోజున సమర్పించేసి.. అందర్నీ పోటీ నుంచి తప్పించేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

అదే జరిగితే.. మున్సిపల్ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పోలీసులకే దక్కుతుందని విపక్ష నేతలు అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని సార్లు స్థానిక నేతలకు మొరపెట్టుకున్నా.. ప్రయోజనం ఉండటం లేదు. ఇదే పద్దతి కొనసాగితే.. రేపు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలా ఏకగ్రీవాలు చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదన్న చర్చ నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close