ప్రత్యేక హోదాని పొలిటికల్ ఇష్యూ చేసి పడేసిన జగన్, పవన్, చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేశాయి. ఆ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. టిడిపి, బిజెపిలు కూడా విభజన కుతంత్రంలో భాగస్వాములే అన్న విషయం తెలిసినప్పటికీ….విభజన చేసిన గాయాల్ని మర్చిపోయేలా చేసేలా బాధ్యత మాది అని ఆ రెండు పార్టీలు ఇచ్చిన హామీలను, చెప్పిన కబుర్లను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది అన్న విషయం ఎన్నికలకు చాలా ముందుగానే తెలిసిపోయింది కాబట్టే మోడీది, నాది అభివృద్ధి జోడీ అన్న చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేయడంలో ఇద్దరు నాయకులూ పోటీ పడతారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించారు. అయితే వాళ్ళ ఆశలను అడియాసలు చేయడంలో, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు, మోడీలు పరస్పరం పోటీ పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రుణమాఫీ హామీలన్నింటినీ అటకెక్కించేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొదటి షాక్ ఇచ్చారు. ఇక మోడీవారు కూడా చంద్రబాబు కన్నా నేనేమన్నా తక్కువా అన్నట్టుగా ప్రత్యేక హోదా హామీకి మంగళం పాడేశారు. ఆ మోసం ప్రజలకు అర్థం కాకుండా మాయ చేయడం కోసం మోడీ, చంద్రబాబులతో పాటు, బిజెపి, టిడిపి నాయకులు కూడా…. మీరు ఆశించినదానికంటే మేం ఎక్కువే చేస్తున్నాం. ఇంతకుమించి మీకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇంతవరకూ ఎవ్వరూ చెయ్యలేదు కూడా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడానికి నానా కష్టాలు పడుతున్నారు. అందుకోసమే కోట్ల రూపాయల పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తున్నారు.

ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి, ప్రతి పక్షనేతకు ఇంతకంటే గొప్ప అవకాశం వేరే ఏమీ ఉండదు. వైఎస్ జగన్ కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికే శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా ముఖ్యమంత్రి పదవి కోసమే అన్న విషయం చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చేసుకుంటూ ఉన్నాడు. ప్రత్యేక హోదా కోసం ధైర్యంగా, వీరోచితంగా పోరాటం చేస్తానంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…..నరేంద్ర మోడీకి భయపడుతున్నాడని విమర్శల వర్షం కురిపిస్తాడు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నాడు కాబట్టే మోడీని విమర్శించే ధైర్యం చంద్రబాబు చేయలేకపోతున్నాడని అంటాడు. మరి తాను ఎందుకు నరేంద్రమోడీని విమర్శించలేకపోతున్నాడు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. అదేంటంటే బిజెపిని విమర్శిస్తున్నాను కదా అని జగన్ సమర్ధించుకోవచ్చు. సినిమా కథా నాయకుడా, రాజకీయ నాయకుడా అన్న కన్ఫ్యూషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముంచుతున్న పవన్ కళ్యాణ్ చేస్తుంది కూడా అదేగా. వెంకయ్యనాయుడితో పాటు, బిజిపి, టిడిపి ఎంపిలను, నాయకులను ఓ స్థాయిలో విమర్శిస్తాడు. తెగ ఆవేశపడిపోతాడు మోడీ, చంద్రబాబులను మాత్రం పల్లెత్తు మాట అనడానికి కూడా ధైర్యం చాలదు. జగన్ చేస్తుంది కూడా అదేగా.

సో…..ఫైనల్‌గా అర్థమయ్యే విషయం ఒక్కటే. చంద్రబాబు, జగన్, పవన్‌ కళ్యాణ్‌లకు మోడీ అంటే భయం. కారణాలేంటన్న విషయం పక్కన పెడితే ముగ్గురికీ కూడా మోడీని విమర్శించేంత ధైర్యం లేదు. అందుకే ముగ్గురూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు డ్రామాలు ఆడుతున్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని 2019 ఎన్నికలలో లాభపడడం కోసం రాజకీయ అంశంగా వాడుకుంటున్నారు. 2019లో కూడా కేంద్రంలో నరేంద్రమోడీనే ప్రధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌లలో ఎవ్వరు ఉన్నా కూడా…. అప్పుడు కూడా ఇవే డ్రామాలు కంటిన్యూ అవుతూ ఉంటాయన్నది వాస్తవం. అధికారంలో ఉన్నవాడు… ప్యాకేజ్ చాలా గొప్పది అని అంటాడు. కేంద్రప్రభుత్వం హోదాకంటే ఎక్కువే ఇస్తోందని చెప్తూ ఉంటాడు. పదవి కోల్పోయిన నాయకుడు మాత్రం ప్రత్యేక హోదాను నేను తీసుకొస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పుకుంటూ తిరుగుతాడు. పేదరికం, అవినీతి నిర్మూలన, మద్య నిషేదంలాంటి ప్రజోపయోగకరమైన విషయాలన్నింటినీ ఇలాగే విజయవంతంగా రాజకీయం చేసి పడేశారు మన నాయకులు. ఇప్పుడు ప్రత్యేక హోదాను కూడా ఆ కేటగిరీలో పడేశారన్న మాట. దేశాన్ని, సమాజాన్ని, ప్రజలను నిజంగా ప్రేమించేవాళ్ళందరూ కూడా నాయకత్వ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రానంత కాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అప్పటి వరకూ అధికారంలో ఉన్న మన సో కాల్డ్ రాజకీయ నాయకులందరూ కూడా అభివృద్ధి కథలను మనకు వినిపిస్తూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close