ఏపీ సెక్రటేరియట్ టాక్ : ఐఏఎస్‌లు డమ్మీలు.. అసలు షో వాళ్లదే..!

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఎప్పుడైనా… ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐఏఎస్ అధికారులే… పాలన సాగిస్తూ ఉంటారు. సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇలా.. వివిధ హోదాల్లో వీరి పని విభజన ఉంటుంది. ఇప్పుడు కూడా.. వీరందరూ ఉన్నారు. కానీ వీరెవరూ పని చేయడం లేదు… చేయనివ్వడం లేదు. వీరి పని అంతా.. ఇతరులు చేస్తున్నారు. వారే… సలహాదారులు. ఐఏఎస్‌లకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా… ప్రభుత్వ పెద్దలతో తమకు ఉన్న సాన్నిహిత్యంతో బెదిరింపు ధోరణితో.. ఇప్పుడు… అన్ని విభాగాలను వారు క్యాప్చర్ చేసేశారనే ప్రచారం జరుగుతోంది.

ప్రతీ బ్లాక్‌లోనూ “ప్రభుత్వ నియామక పవర్ ఫుల్” వ్యక్తి..!

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో దాదాపుగా ఉన్న ప్రతీ విభాగంలోనూ.. ఓ పవర్ ఫుల్ వ్యక్తి కొత్తగా వచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల కన్నా… మిన్నగా… ప్రభుత్వం ద్వారా ఔట్ సోర్సింగ్ ద్వారానో… డిప్యూటేషన్ ద్వారానో వచ్చిన వారే ఇందులో అధికం. నిర్ణయాలు వారే తీసుకుంటున్నారు. సంతకాలు మాత్రం.. సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇది.. సెక్రటేరియట్‌లో అసంతృప్తికి కారణం అవుతోంది. పని వాతావరణం దెబ్బతింటోందని.. సెక్రటేరియట్ ఉద్యోగులు.. బహిరంగంగానే వ్యాఖ్యానించడం ప్రారంభించారు. పెద్దగా పని ఉండని.. శాఖల్లోనూ… ఇలాంటి పరిస్థితి ఉండటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఎప్పుడూ లేనంత భిన్నమైన వాతావరణం ఇప్పుడు సెక్రటేరియట్‌లో ఉంది.

వీళ్లకి జీత భత్యాలు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌ల కన్నా ఎక్కువే..!

సలహాదారులు… ఇతర నియామకాలు ప్రభుత్వ పెద్ద వద్ద నుండి పొందిన వారికి జీతభత్యాలు.. ప్రారంభమే రూ. మూడు లక్షల నుంచి ఉంటున్నాయి. అది కేవలం జీతమే వారికి ఎనిమిది మంది సిబ్బంది, ఇతర అవసరాలు.. అన్నీ కలిపి… ఏడాది… రూ. కోటి చేరుకుంటుందన్న ప్రచారమూ ఉంది. సీనియర్ ఐఏఎస్‌లకు అంత జీతాలు లేవు. అంతే కాదు.. ఇప్పుడు.. అధికారాలు కూడా లేవు. ఐఏఎస్‌ల మాట వినడానికి.. ఉద్యోగులు కూడా వణికిపోయే పరిస్థితి వచ్చింది. తమ మాటే వినాలన్న శాసనాన్ని సలహాదారులు అమలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రోజు రోజుకు… ఇలా నియమించేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దాంతో పరిస్థితి రాను రాను మరింత దిగజారుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

సాక్షి హెడ్ క్వార్టర్ గా మారిన సచివాలయం…!

ఏపీ సెక్రటేరియట్‌కి ఇప్పుడు ఏ మూలకి వెళ్లినా సాక్షి ఉద్యోగి కనిపిస్తున్నారు. ఉన్నత స్థాయిలో… బ్యూరో చీఫ్ గా పని చేసిన వారి దగ్గర్నుంచి చివరికి ఆఫీస్ బాయ్ కూడా.. సాక్షి నుంచే… సెక్రటేరియట్‌లోకి దిగుమతి అయ్యారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి, జీవీడి క్రిష్ణమోహన్, శ్రీహరి, నగేష్, చింతకింది శ్రీనివాసరావు, రాజారమేష్, ఈశ్వర్ లాంటి జర్నలిస్టులు ఇప్పటికే హల్ చల్ చేస్తున్నారు. 25 మంది మంత్రులకు 25 మంది సాక్షి ఉద్యోగులుగా నియమించారు. ఫోటో గ్రాఫర్లూ సాక్షి నుంచే. చివరికి ఆఫీసు బోయ్ లు కూడా సాక్షి నుంచే తీసుకుని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్నారు. దీంతో.. ఎక్కడ చూసినా… సాక్షి ఉద్యోగులే కనిపిస్తున్నారు. ఓ వైపు.. బయట వ్యక్తుల హడావుడి.. మరో వైపు సాక్షి ఉద్యోగుల హల్ చల్… ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close