చట్టాన్ని అమలు చేస్తున్నారా? భయపెట్టాలని చూస్తున్నారా?

చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే డైలాగ్ గతంలో మన నాయకుల నోటి వెంట తరచుగా వచ్చేది. ఇప్పుడు ఇంకాస్త అడ్వాన్స్ అయ్యారు. ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతే ఒప్పుకునేది లేదు. కచ్చితంగా శిక్షలు అనుభవించాల్సిందే, జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పి తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సోెషల్ మీడియా గురించి టిడిపి నేతల నోటి వెంట తరచుగా వచ్చిన మాటలు ఇవే. నిజానికి ఒక రకంగా ఈ ట్రెండ్ స్టార్ట్ చేసిందే టిడిపికి సంబంధించిన వాళ్ళు. వైఎస్ రాజశేఖరెడ్డి అవినీతిపరుడు, జగన్ అవినీతికి పాల్పడ్డాడు అని చెప్తే ఎవ్వరూ ఏమీ తప్పుపట్టడానికి లేదు. కానీ వైఎస్సార్ మరణం తర్వాత నుంచీ ఉన్మాదుల్లా రెచ్చిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వైఎస్సార్ మరణం గురించి అయితే మనుషులమని మర్చిపోయి మరీ మాట్లాడేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇక టిడిపి జనాలకు కౌంటర్ ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో వైకాపా జనాలు కూడా ఎన్టీఆర్ మరణం గురించి చిత్తానికి కామెంట్స్ చేసి పడేశారు. టిడిపి జనాలు ఇంకాస్త ముందుకు వెళ్ళి షర్మిళ గురించి, ఒక సినిమా హీరో గురించి జుగుప్స కలిగేలా కామెంట్స్ చేశారు. అప్పుడంతా టిడిపి నేతలకు సంతోషంగానే ఉన్నట్టున్నది కానీ ఇప్పుడు లోకేష్ గురించి ‘పప్పు’ అంటూ వైకాపా సోషల్ మీడియా జనాలు రెచ్చిపోతూ ఉండేసరికి ఆవేశం తన్నుకొచ్చింది.

అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే….తప్పులు చేస్తున్న, చేసిన వాళ్ళపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటే ఎవ్వరూ ఏమీ అనడానికి లేదు. కానీ పొలిటికల్ పంచ్ పేజీ నిర్వాహకుడు రవికిరణ్ విషయంలో అంతా రాజకీయమే నడిచింది. చట్ట ప్రకారం శిక్షించాలి అన్న చిత్తశుద్ధి కంటే కూడా సోషల్ మీడియాలో లోకేష్‌కి వ్యతిరేకంగా రెచ్చిపోతున్నవాళ్ళకు హెచ్చరికగా ఉండాలి అన్న ఉద్ధేశ్యంతోనే ముఖ్య నాయకులు పోలీసుల ద్వారా కథ నడిపినట్టుగా ఉంది. ఇలాంటి చర్యలు మంచి కంటే చెడే ఎక్కువ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఇష్టారీతిన రెచ్చిపోతున్న జనాలను శిక్షిస్తామంటే ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కానీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం అన్న తర్వాత విధానాలను అయితే ఫాలో అవ్వాలి కదా. ఏం చేసినా రాజ్యాంగం ప్రకారం చేస్తామని ప్రమాణాలు చేశారుగా. ఆ విషయం పక్కన పెడితే పొలిటికల్ పంచ్ పేజీలో అభ్యంతరకర పోస్టులు చాలానే ఉన్నాయి. విమర్శల స్థాయిని దాటిన కుసంస్కారం కనిపిస్తూనే ఉంది. మరి రవికిరణ్ విషయంలో పోలీసులు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు? ఈ ప్రశ్న రైజ్ అయిందంటే మాత్రం రవికిరణ్‌ని అరెస్ట్ చేసి లోకేష్‌కి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టారీతిన కామెంట్స్ చేస్తున్నవాళ్ళకు హెచ్చరికలు పంపాలనుకున్న పెద్దల ఆలోచన నీరుగారిపోవడం ఖాయం. రవికిరణ్ విషయంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియదు కానీ తేడా వస్తే మాత్రం అసలుకే మోసం వస్తుంది. అయినా ఇప్పుడంటే ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏం చేస్తారు? క్షణాల్లో లక్షలమందికి మెస్సేజ్‌లు పాస్ చేయగల సమర్థులు చాలా మందే ఉన్నారు. ఏది ఏమైనా టిడిపి ప్రభుత్వం మాత్రం అనవసరంగా సోషల్ మీడియాతో పెట్టుకుందేమోనని కూడా అనిపిస్తోంది. లోకేష్ కాస్త తొందరపడినట్టున్నాడు. ఇప్పుడిక సోషల్ మీడియాలో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నవాళ్ళ విషయంలో చట్టాలను మార్చడంతో పాటు, శిక్షలు కూడా పడేలా చేశారా ఒకే…లేకపోతే మాత్రం అలాంటి జనాలు ఇంకా రెచ్చిపోవడం ఖాయం. సుప్రీం కోర్టు కూడా సోషల్ మీడియా జనాలను అరెస్ట్ చేసే విషయంలో వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ఎలా ఉంటాయో చూడాలి మరి. ఈ విషయంలో బాధ్యత గల ప్రతిపక్షనేత స్థానంలో ఉన్న జగన్ ప్రతిస్పందన కూడా బాగాలేదు. కులాల పేర్లతో కూడా నీచమైన కామెంట్స్ చేస్తున్న జనాలను కూడా జగన్ సమర్థిస్తాడా? అలాగే లోకేష్ గురించి చేస్తున్న హీనమైన కామెంట్స్‌ని జగన్ సమర్థిస్తాడా? ఇప్పుడు సమర్థించాడంటే మాత్రం రేపు జగన్ కూడా ఇదే ట్రీట్‌మెంట్‌కి రెడీగా ఉండాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close