ఈబీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గుతున్న పార్టీలు

అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. లోక్ సభలో ఈ బిల్లు పాస్ అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇంకా ఈ బిల్లు రాజ్యసభలో పాస్ కావలసి ఉంది. ఇప్పుడిప్పుడే మెల్లిగా రాజకీయ పార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అనే అంశంపై విమర్శలు మొదలు పెడుతున్నారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ బిల్లు పై విమర్శలు మొదలుపెట్టారు. నిజానికి ఆర్థిక వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు అనే అంశం ఎప్పటి నుంచో చర్చలో ఉంది. అయితే దీన్ని కుల ఆధారిత రిజర్వేషన్లను సమర్థించే వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. కులాన్ని తప్పుగా చూపించడం కష్టమే కానీ వార్షిక ఆదాయాన్ని తక్కువగా చూపించడానికి అనేక మార్గాలున్నాయని, ఆ మార్గంలో నకిలీ పత్రాలతో రిజర్వేషన్లు సంపన్నులు పొందుకుంటారని, తద్వారా సంపన్నులే ఈ బిల్లు వల్ల లాభం పొందుతారని- ఇలా రకరకాల వాదనలు వీరు చేస్తుంటారు. అయితే ఇప్పుడు, ఆర్థిక వనరుల ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లు భవిష్యత్తులో కుల రిజర్వేషన్లను పూర్తిగా నిర్మూలించే కుట్రతోనే ప్రవేశపెట్టారని కొత్త వాదన వీరు లేవదీస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ సరిగ్గా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్- ఇది భవిష్యత్తులో కుల ఆధారిత రిజర్వేషన్లు అంతం చేసేందుకు బిజెపి పార్టీ చేస్తున్న కుట్ర అని చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఇది చాలా డేంజరస్ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

మరోపక్క కాంగ్రెస్ నేతలు కూడా మెల్లిగా స్వరం మారుస్తున్నారు. అసలు ఉద్యోగాలు కల్పించకుండా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. అదీగాక ఇంత హడావుడిగా ఈ బిల్లు తీసుకు రావడం వల్ల బిల్లులో అవకతవకలను సరిదిద్దే అవకాశం లేకుండా పోతుందని వారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దాంతో పాటు ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రిజర్వేషన్లు వర్తింప చేస్తున్నాం అంటున్నారు కదా మరి దానికి సంబంధించిన గణాంకాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.మెల్లిగా ఒక్కొక్క పార్టీ స్వరం మారుస్తున్న తీరు చూస్తుంటే, రాజ్యసభలో ఏ మేరకు ఈ బిల్లు ఆమోదం పొందుతుందనేది ప్రశ్నార్థకం గా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close