ఆర్య హీరోగా `సామ్రాజ్యం`

ప్ర‌తి మ‌నిషి పుట్టుక‌కూ ఓ కార‌ణం ఉంటుంది. త‌ప్ప‌కుండా పుట్టిన ప్ర‌తిమ‌నిషీ ఏదో ఒక‌టి చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు… ఈ నేప‌థ్యంలో ఆర్య హీరోగా త‌మిళంలో ఓ సినిమా తెర‌కెక్కింది. తెలుగులో `సామ్రాజ్యం` పేరుతో అనువాద‌మ‌వుతోంది. ఈ సినిమాలో ఆర్యకు జోడీగా కీర్తి న‌టించారు. చ‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. నైనాల సాంబ‌మూర్తి హైమావ‌తి స‌మ‌ర్పిస్తున్నారు. వీవీయ‌స్ క్రియేష‌న్స్ ప‌తాకంపై తెలుగులోకి అనువాద‌మ‌వుతోంది. నైనాల సాయిరామ్ అనువ‌దిస్తున్నారు. రాజ‌శ్రీ మ‌ణికంఠ స‌హ నిర్మాత‌. `సామ్రాజ్యం` నిర్మాత నైనాల సాయిరామ్ మాట్లాడుతూ “ఆర్య కెరీర్‌లో చేసిన తొలి మాస్ సినిమా ఇది. త‌మిళంలో మంచి హిట్ అయింది. తెలుగుకు ప‌క్కాగా స‌రిపోయే స‌బ్జెక్ట్ ఇది. ప్ర‌తి మ‌నిషి పుట్టుక‌కు ఓ కార‌ణం ఉంటుంది. అలాగే మా హీరో పుట్టుక‌కు కూడా కార‌ణం ఉంది. త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రించుకోవ‌డం కోసం హీరో ఏం చేశాడు? ఎలా పోరాడాడు? ఎవ‌రితో ఎలా త‌ల‌ప‌డ్డాడు? అనేది ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌. అనువాద ప‌నులు పూర్త‌య్యాయి. ఐదు పాట‌లు, యాక్ష‌న్ సీక్వెన్స్, కామెడీ సినిమాకు హైలైట్ అవుతాయి. త్వ‌ర‌లోనే పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం“ అని అన్నారు.
నాజ‌ర్‌, నెపోలియ‌న్‌, అదిశ‌య అవినాష్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు సంగీతం: భ‌ర‌ద్వాజ్‌, పాట‌లు: శివ‌గ‌ణేష్‌, బాల‌వ‌ర్ధ‌న్‌, హ‌రిదాస్ సింగ‌టూరి, మాట‌లు: రాజ‌శేఖ‌ర్ రెడ్డి, స‌హ నిర్మాత‌: రాజ‌శ్రీ మ‌ణికంఠ‌, స‌మ‌ర్ప‌ణ‌: నైనాల సాంబ‌మూర్తి హైమావ‌తి, నిర్మాత‌: నైనాల సాయిరామ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close