ఫస్ట్ జీవో మాయ..! ఆశావర్కర్లు మోసపోయినట్లే..!?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి… సచివాలయంలో.. మొదటి సారిగా.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చేసిన మూడు సంతకాల్లో మొదటిది.. ఆశావర్కర్లకు జీతం రూ. పదివేలు చేయడం. దీనిపై జాతీయ మీడియాలోనూ విస్తృతమైన కవరేజీ లభించింది. సేవ చేస్తున్న వారికి జగన్మోహన్ రెడ్డి సముచితమైన గౌరవం ఇచ్చారని.. ప్రశంసించారు. కానీ మూడు నెలలు తిరిగే సరికి… అదే ఆశావర్కర్లు.. రోడ్డెక్కారు. వారు డిమాండ్ ఒక్కటే.. తమకు.. జగన్ మోహన్ రెడ్డి ఇస్తామని చెప్పి.. జీవో విడుదల చేసిన రూ. పదివేల జీతం ఇవ్వాల్సిందేనని. అదేంటి… సీఎం మొదటి సంతకం పెట్టినా.. ఎందుకివ్వడం లేదనేది.. చాలా మందికి అర్థం కాని విషయం.

జగన్మోహన్ రెడ్డి జూన్ ఎనిమిదో తేదీన ఆశావర్కర్ల జీతాలు పెంపుపై సంతకం పెట్టారు. అయితే దానికి సంబంధించిన జీవో రెండు నెలల తర్వాత ఆగస్టు ఏడో తేదీన జీవో విడుదల చేశారు. పెంచిన జీతాలు.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా.. పెంచిన జీతం వస్తుందేమో అనుకున్నారు. కానీ రాలేదు. కానీ ఆ పదివేలు సంతకానికేనని.. అసలు రాదని తేలిపోయింది. పైగా… ఓ కొత్త గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దాని ప్రకారం.. ఆశా వర్కర్లలో.. కనీసం సగం మందిని మూడు నెలల్లో తీసేయబోతున్నారు.

జగన్మోహన్ రెడ్డి సర్కార్ జారీ చేసిన జీవో ప్రకారం.. ఆశావర్కర్ల పనితీరును.. కనీసం పది మంది అసెస్‌మెంట్ చేస్తారు. అందరూ మంచి గ్రేడ్లు ఇవ్వాలి. ఆ గ్రేడ్ ప్రకారం వస్తేనే రూ. పదివేల జీతం వస్తుంది. కానీ… ఆ గ్రేడ్ రావడం.. అనేది సాధ్యం కాదు. కానీ.. గ్రేడ్ సిస్టం వల్ల ఆశావర్కర్లు మూడు నెలలపాటు రూ. 3,500 వస్తే ఉద్యోగం ఆటోమేటిక్‌గా పోతుంది. దీంతో ఆశావర్కర్లు హతాశులయ్యారు. ఉన్నది పోయింది.. ఉంచుకున్నదీ పోయిందన్న చందంగా.. పాత జీతాలు ఇవ్వలేదని, కొత్త జీతాలు కూడా అమలు చేసే పరిస్థతిలేదని ఆందోళనతో వారంతా రోడ్డెక్కారు. కానీ ప్రభుత్వం మాత్రం వారిని పోలీసులతో లాగించి పడేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close