కబడ్డీ ప్రపంచ కప్: సెమీస్ లో అన్నీ ఆసియా జట్లే

ప్రపంచంలో భారత్ కు ఎదురులేని క్రీడాంశం కబడ్డీ. భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి మరోసారి టైటిల్ కోసం పోటీ పడుతోంది. అయితే, అనూహ్యంగా ఈసారి తొలి మ్యాచ్ లోనే దక్షిణ కొరియా జట్టు చేతిలో పరాజయం పాలైంది. అతి ఆత్మ విశ్వాసం, పొరపాట్లు ఎలా కొంప ముంచుతాయో భారత్ కు అర్థమైంది. ఇక ముందు జాగ్రత్తగా ఆడేలా కళ్లు తెరిపించినట్టయింది. కొరియాపై భారత్ అలవోకగా గెలుస్తుందనుకుంటే సీన్ రివర్సయింది. 34-32 స్కోరుతో భారత్ కు కొరియా షాకిచ్చింది.

మొత్తానికి టోర్నీ సెమీస్ దశకు చేరింది. హోరాహోరీగా జరిగిన అనేక మ్యాచ్ లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. కొన్ని మ్యాచ్ లు సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగాయి. ఆస్ట్రేలియాను చిత్తు చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్ సెమీస్ కు చేరకపోవడం ఓ విశేషం. కెన్యా వంటి ఆఫ్రికా దేశాల ఆటగాళ్లు శారీరకంగా బలవంతులైనా టెక్నిక్ లో వెనకబడ్డారు. అందుకే, టోర్నీలో ముందుకు వెళ్లలేకపోయారు.

ప్రస్తుతం సెమీస్ కు చేరినవన్నీ ఆసియా జట్లే. తరతరాలుగా కబడ్డీ గరించి తెలిసింది భారత ఉపఖండం ప్రజలకే. ఆ తర్వాత ఆసియాలోని మరికొన్ని దేశాలకు ఈ ఆట విస్తరించింది. ఈసారి ప్రపంచ కప్ సెమీస్ లో భారత్, థాయ్ లాండ్, ఇరాన్, కొరియా పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ లు శుక్రవారం జరుగుతాయి. థాయ్ లాండ్ ను ఏ రేంజిలో భారత్ ఓడిస్తుందనే దానిపై రకరకాల అంచనాలున్నాయి.

అహ్మదాబాద్ లో రాత్రి 8 గంటలకు జరిగే తొలి సెమీస్ లో ఇరాన్, కొరియా తలపడతాయి. టైటిల్ ఫేవరేట్ భారత్ తర్వాత ఇరాన్ పైనే ఎక్కువ అంచనాలున్నాయి. అయితే కొరియా కూడా తక్కువతినలేదు. భారత్ నే ఓడించిన ఆత్మవిశ్వాసంతో సెమీస్ ఆడుతుంది. కాబట్టి మ్యాచ్ హోరాహోరీ జరగవచ్చు. రాత్రి 9 గంటలకు జరిగే భారత్, థాయ్ లాండ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఆసియా క్రీడల్లోకి ప్రవేశించిన కబడ్డీకి ఒలింపిక్స్ లోనూ చోటు కల్పించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. గత కొన్నేళ్లుగా కబడ్డీకి ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు, ఇంగ్లండ్, ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల వరకూ కబడ్డీ ఆడుతున్నాయి. కాబట్టి ఒలింపిక్స్ లోకి కబడ్డీ ప్రవేశించే రోజు ఎంతో దూరంలో లేదని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close