తెలుగు సినిమా గతిని మార్చగల స్థాయి ఉన్న యువ డైరెక్టర్స్‌లో ఒకరిగా అవసరాల శ్రీనివాస్ గురించి చెప్తూ ఉంటారు విమర్శకులు. ఊహలు గుసగుసలాడే సినిమాతోనే తన ఆలోచనా స్థాయి ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్టయినప్పటికీ, ఆ సక్సెస్‌ని క్యాష్ చేసుకుందామని వెంటనే సినిమా మొదలెట్టకుండా మళ్ళీ తనను ఇన్స్పైర్ చేసే స్థాయి కొత్త పాయింట్ రెడీ అయ్యే వరకూ వెయిట్ చేసి మరీ రంగంలోకి దిగాడు అవసరాల. నా సినిమా ప్రత్యేకంగా నిలిచిపోవాలి అని తపించే డైరెక్టర్స్ మాత్రమే ఈ మెచ్యూరిటీ చూపిస్తూ ఉంటారు. ఊహలు గుసగుసలాడే సినిమా కథ, కథనాల విషయం పక్కన పెడితే రిలీజ్ అయిన సంవత్సరాల తర్వాత చూసినా కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అవసరాల శ్రీనివాస్ బ్యూటిఫుల్ మేజిక్ మనల్ని కట్టిపడేస్తుంది.
ఇప్పుడు మరోసారి ‘జ్యో…అచ్యుతానంద’ అనే మరో అచ్చ తెలుగు సినిమాతో మనముందుకు వస్తున్నాడు అవసరాల. ఈ సినిమా టీజర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా టచింగ్‌గా ఉంది. నాగసౌర్య, రెజీనా, నారా రోహిత్‌లు ముగ్గురూ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అవసరాల మాటలు కూడా మురిపించేలా ఉన్నాయి. ఓవరాల్‌గా ఓ వంద తెలుగు సినిమా టీజర్స్‌లో ఈ అవసరాల ట్రైలర్ ప్రత్యేకంగా కనిపించడం మాత్రం ఖాయం. చాలా సునిశితంగా, క్యారెక్టర్స్ మాత్రమే కనిపించేలా చాలా బాగా టీజర్‌ని రూపొందించారు. నారా రోహిత్ కూడా నాగసౌర్య ఇంపార్టెన్స్ కొంచెం తగ్గించాలి లాంటి ఇమేజ్ వెంట పరుగెత్తే తెలుగు సినిమా హీరోల పైత్యం ఏమీ చూపించినట్టు లేడు. ఆ విషయంలో రోహిత్‌ని అభినందించాలి. అయితే కొంచెం లావు తగ్గి ఉంటే మాత్రం ఈ క్యారెక్టర్‌కి ఇంకా బాగా సూట్ అయ్యి ఉండేవాడు. ఆ ఒక్క లోపాన్ని పక్కన పెట్టేస్తే అవసరాల టీజర్ చాలా బాగుంది.