అ! ట్రైల‌ర్ టాక్‌: భ‌గ‌వ‌ద్గీత + క‌ప్పు కాఫీ.. ఓ తుపాకీ!


నాని నిర్మాత‌గా మారి ఓ సినిమా తెర‌కెక్కించాడంటే… క‌చ్చితంగా ఆ క‌థ‌లో ఏదో మాయ ఉండాలి. ఏదో కొత్త‌ద‌నం క‌నిపించాలి. ఆ కొత్త‌ద‌నంతో మాయ చేసింది.. ‘అ’ ట్రైల‌ర్‌. ప‌ది పాత్ర‌ల చుట్టూ న‌డిచే క‌థ ఇది. కాజ‌ల్‌, న‌రిత్య‌మీన‌న్‌, రెజీనా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ముర‌ళీశ‌ర్మ‌… ఇలా తారాగ‌ణం భారీగానే క‌నిపిస్తోంది. టైటిల్ కూడా ఆక‌ట్టుకొంటోంది. ఇప్పుడు ట్రైల‌ర్ వ‌చ్చింది. నాని ఓ చేప‌గా, ర‌వితేజ ఓ చెట్టుగా క‌నిపించ‌బోతున్నారు. అంటే చేప‌, చెట్టుల‌కు వాళ్లిద్ద‌రూ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చార‌న్న‌మాట‌. ”చేప‌ల‌కు కూడా క‌న్నీళ్లుంటాయి బాస్‌.. నీళ్ల‌లో ఉంటాం క‌దా క‌నిపించ‌వు” అనే నాని డైలాగ్ కూడా ఈ ట్రైల‌ర్‌లో వినిపించింది. ప‌ది పాత్ర‌లు, పది క‌థ‌ల్ని.. ఒకే త్రాటిపైకి ఎలా తీసుకొచ్చాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. విజువ‌ల్స్‌, నేప‌థ్య సంగీతం ఇవ‌న్నీ క‌చ్చితంగా ఆక‌ట్టుకునేలా సాగింది. ఓక‌ప్పు కాఫీ దాని ప‌క్క‌ర‌ భ‌గ‌వ‌ద్గీత‌, ఓ తుపాకీ, షుగ‌ర్ క్యూబ్స్‌, గులాబీ… ఇలా ఈ క‌థ‌లో ఉన్న గాఢ‌త‌ని వ‌స్తువ‌ల రూపంలో చూపించే ప్ర‌య‌త్నంచేశాడు ద‌ర్శ‌కుడు. క‌థ‌లో విష‌యం ఉంద‌నిపిస్తోంది. ఓ కొత్త జోన‌ర్‌లో సాగే ఈ సినిమా ఇద‌ని అర్థం అవుతుంది. ఫిబ్ర‌వ‌రి 16న ఈ సినిమా విడుద‌ల కానుంది. మ‌రి నాని చేసిన ఈ ప్ర‌యోగం ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతుందో తెలియాలంటే అప్ప‌టి వ‌ర‌కూ ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.