గడ్కరీని టీడీపీ మంత్రి అలా పొగిడేశారేంటి..?

భారతీయ జనతా పార్టీ నేతలు.. ఏపీకి వస్తున్నారంటే.. ముఖ్యంగా కేంద్రమంత్రివర్గంలో ఉన్న వారు… ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలకు కాలిపోతుంది. రాష్ట్రానికి చేసినంత అన్యాయం చేసి… మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తున్నారంటూ… వచ్చే నేతల స్థాయిని బట్టి దండయాత్రలు చేస్తూ ఉంటారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. టూర్‌ను రద్దు చేసుకున్నారు. పరిస్థితి ఇలా ఉందని.. ఏపీని వదిలేయలేని పరిస్థితి బీజేపీది. అందుకే వారానికో కేంద్రమంత్రిని ఏపీకి పంపించి.. ఏదో ఒకటి చెప్పాలని డిసైడయింది. దీనికైనా టీడీపీ నేతలు ఊరుకుంటారా..? అనే డౌటనుమానం బీజేపీకి ఉంది కాబట్టి.. మొల్లగా కడప నుంచి ప్రారంభించారు. కడప జిల్లాలో అయితే రహస్య మిత్రుడు జగన్‌కు చెందిన వైసీపీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి… సేఫ్ పాసేజ్ ఉంటుందని.. దాని తర్వాత మెల్లగా ఇతర జిల్లాల్లో అడుగు పెట్టవచ్చని ప్లాన్ వేసుకున్నారు. దాని ప్రకారం.. కేంద్రహోంమంత్రి..రాజ్‌నాథ్ సింగ్ మొదటగా కడపకు వచ్చారు. ఆయనను అడ్డుకుని అనవసరంగా రచ్చ చేయడం ఎందుకునుకున్నారేమో కానీ ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన చేసిన విమర్శలకు మాత్రం ఘాటు కౌంటర్లు ఇచ్చారు.

ఆ తర్వాత వంతు… నితిన్ గడ్కరీది. ఆయనను ఎవరూ అడ్డుకోలేదు. ఆయన పార్టీ వేదికలపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కానీ.. ప్రభుత్వ వేదికలపై మాత్రం… అంతులేని విధంగా పొగిడేశారు. ఏపీలో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో నితిన్ గడ్కరీతో పాటు పాల్గొన్న మంత్రి అయ్యన్న పాత్రుడు… పొగడ్తలు కురిపించడంలో ఏ మాత్రం మొహమాట పడలేదు. పనిచేసే కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలిసిన వ్యక్తి అన్నారు. అందుకే గతంలో ప్రతి నెలా రాష్ట్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించేవారన్నారు. ఏపీలో గడ్కరీ సహకారంతో 13 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామని సర్టిఫికెట్ ఇచ్ేచసారు. రాజకీయాలు ఉంటాయి..అలాగని సాయం చేసేవారిని మర్చిపోకూడదు అని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎవరు సాయం చేసినా చేతులెత్తి దండం పెట్టాల్సిందే 16 వేల కోట్లతో పనులు చేపట్టిన గడ్కరీకి ఎన్ని దండాలు పెట్టాలని కృతజ్ఞత కూడా చూపారు.

అయ్యన్న స్పందన తెలుగుదేశం పార్టీ వర్గాల కన్నా… బీజేపీ నేతలనే ఎక్కువ ఆశ్చర్య పరిచింది. కారణం .. ఢిల్లీ రాజకీయాలే. ఇటీవలి కాలంలో.. ఆరెస్సెస్ మోడీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీని ప్రొత్సహిస్తోందని చెబుతున్నారు. అందుకే.. మోడీ, షాలపై గడ్కరీ అప్పుడప్పుడూ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారని చెబుతున్నారు. గడ్కరీ అలా మాట్లాడటం వెనుక.. చంద్రబాబు ఉన్నారంటూ.. సాక్షి పత్రిక అప్పుడప్పుడూ కొత్త కోణాలు ఆవిష్కరిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా అయితే.. ఇలాంటి కథనాలు కారణం లేకుండా ఏ పత్రిక రాయదు. అది నిజమేమో అని బీజేపీ నేతలు అనుకునేలా అయ్యన్న పాత్రుడు గడ్కరీని పొగిడేశారు. రాజకీయం అంటే ఇదేనేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close