మహిళా దర్శకులపై ఉండే స్టీరియోటైప్ అభిప్రాయాన్ని మార్చిన జయ

టాలీవుడ్ ని మరో దురదృష్టం వెంటాడింది. మహిళా దర్శకురాలు, తెలుగు సినీ పరిశ్రమలో అందరి తలలో నాలుకలా ఉండే పి ఆర్ వో బి.ఎ.రాజు సతీమణి జయ గుండెపోటుతో ఈరోజు మరణించింది. చంటిగాడు లవ్లీ గుండమ్మగారి మనవడు వైశాఖం ఇలాంటి చిత్రాలు తీసిన జయ దర్శకురాలు అయినా తొలినాళ్లలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహిళా దర్శకుల పై, ప్రేక్షకులలోనూ పరిశ్రమలోనూ ఉండే ఒక స్టీరియోటైప్ మార్చడమే తన ఉద్దేశ్యమని చెప్పుకొచ్చింది.

సాధారణంగా మహిళా దర్శకులు అనగానే ఫెమినిస్టు కథలతోనో, హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కుటుంబ కథలతోనో మాత్రమే సినిమాలు తీస్తారని అటు ప్రేక్షకులను ఇటు పరిశ్రమలోనూ ఒక స్టీరియోటైప్ అభిప్రాయం ఉంది. అయితే ఆ అభిప్రాయాన్ని బద్దలుకొట్టి పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రాలు తీయడంలో మహిళా దర్శకులు ఏ మాత్రం తీసిపోరని నిరూపించడమే తన ఉద్దేశ్యమని అందుకే యాక్షన్ రొమాన్స్ సెంటిమెంట్ లాంటి అన్ని ఎమోషన్స్ కలగలసిన కమర్షియల్ కథలనే తాను తెరకెక్కిస్తానని దర్శకురాలు జయ చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే తాను తీసిన అన్ని సినిమాలు కమర్షియల్ కథలతోనే తీశారు.

తాను తీసిన సినిమాలలో, మరీ సూపర్ హిట్ సినిమాలు లేక పోవచ్చు కానీ దాదాపు బడ్జెట్ పరంగా చూస్తే చాలా వరకు ప్రాఫిట్ వెంచర్లే.

విశ్లేషకురాలు నుంచి దర్శకురాలి దాకా

దర్శకురాలు జయ ముందుగా తన కెరీర్ విశ్లేషకురాలు గా ప్రారంభించింది. ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, సాహిత్యం పై మక్కువ కలిగిన జయ జర్నలిజం కోర్సు కూడా చేసింది. ఆంధ్రజ్యోతి పత్రికలో సినిమా పేజీ కోసం పని చేసింది. ఆ తర్వాత జ్యోతిచిత్ర సినిమా మ్యాగజైన్ లో కూడా పని చేసింది. ఇక ఆ తర్వాత సొంతంగా సూపర్ హిట్ అనే సినిమా మ్యాగజైన్ను ప్రారంభించడం, పేరుకు తగ్గట్టే అది సూపర్ హిట్ కావడం తెలిసిందే. సూపర్ హిట్ వ్యవహారాలన్నీ బిఏ రాజు చూసుకునేవారు.

దర్శకురాలిగా తాను కోరుకున్నంత గొప్ప స్థాయికి వెళ్లలేక పోయి ఉండవచ్చు కానీ ఆమె విశ్లేషకుడరాలిగా మాత్రం ఆమె పరిజ్ఞానాన్ని చూసినవారు పరిశ్రమలో ఆశ్చర్యపోయేవారు. 1983 నుంచి ఒక దశాబ్దం పాటు నంబర్ 1 స్థానంలో ఉన్న చిరంజీవి 1993 నుంచి 95 దాకా భారీ ఫ్లాప్ లను మూట కట్టుకున్నాడు. అయితే దాదాపు ఒక ఏడాది వరకు బ్రేక్ తీసుకుని మొత్తం తన కెరీర్ని మరొకసారి విశ్లేషించుకుని తాను ఏ పాత్రలు వేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న దానిమీద చాలా తర్జనభర్జన పడి ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్లర్ , మాస్టర్ వంటి వరుస హిట్లతో దూసుకుపోయారు. అయితే ఆ సమయంలో తన పాత్రలను తన సినిమాలను తన కెరీర్ని విశ్లేషించడంలో బి జయ గారి ఇన్ పుట్స్ ఎంతకాలం సహాయపడ్డాయి అని అప్పట్లో ఒకసారి చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే అప్పటికింకా ఆమె దర్శకురాలు కాలేదు.

ఏది ఏమైనా 54 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో మరణించి, మహిళా దర్శకుల విషయంలో టాలీవుడ్ కి తన లోటు తీర్చలేనిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com