బాహుబలి వస్తాడా? బాహురెడ్డి వస్తాడా?

ఎన్నికల నాటికి ఒక బాహుబలి వస్తాడని కాంగ్రెస్‌ ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో చాలా చర్చ జరుగుతున్నది. అప్పటికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పూర్తవుతాయా అన్న ప్రశ్న సందర్భంలో చేసిన వ్యాఖ్య అది. అంటే అప్పటికి ఎవరో బాహుబలి వచ్చి పూర్తి చేస్తాడా అని ఎద్దేవా చేయడం ఆయన ఉద్దేశం కావచ్చు.కాదు ఎన్నికల నాటికి టిపిసిసి అద్యక్షుడు మారతాడని తానే ఆ బాధ్యత తీసుకుని నడిపిస్తానని చెప్పదలచారా? ఎందుకంటే శాసనసభలో ఇకపై బడ్జెట్‌పై మాట్లాడబోనని ఒకటకి రెండు సార్లు ప్రకటించారు. అందులో సభ బయిటి విషయాలపై కేంద్రీకరిస్తాననే అర్థం వుందనుకోవచ్చా?

ఇది ఇలా వుంటే టిటిడిపి నేత రేవంత్‌ రెడ్డి మరోఅర్థం ఇస్తూ అప్పటికి మంత్రి హరీష్‌ రావు బాహుబలిలా తమవైపు వస్తాడని జానారెడ్డి ఉద్దేశం కావచ్చని భాష్యం చెప్పారు. అయితే తమాషా ఏమంటే తానే ఒక బాహుబలిని అని భావించే వారిలో రేవంత్‌ ఒకరు. అధినేత చంద్రబాబు నాయుడు చేతులెత్తేసినా రేవంత్‌ మాత్రం ఏదో ఒక హడావుడి చేస్తూనే వున్నారు. పైగా సామాజిక కోణంలో తాను కొత్తసమీకరణాలు విధేయతలను కూడా పెంపొందించే అవకాశం వుంటుందని ఆయన చాలాసార్లు మీడియాకు చెబుతుంటారు. ఇంకా చెప్పాలంలే కాంగ్రెస్‌లోని రెడ్లకు తాను నాయకత్వ లోటు తీరుస్తానన్నట్టు చాలాసార్లు మాట్లాడారు.బహుశా ఆ మాటలు కాస్త మరుగుపర్చడానికే ఇప్పుడు హరీష్‌ రావు ప్రస్తావన తెచ్చి వుంటారు. వాస్తవంగా పదేపదే హరీష్‌ కెసిఆర్‌ తగాదాలను గురించి మాట్లాడే వ్యక్తి రేవంత్‌.

ఇంతకూ జానారెడ్డి చెప్పినా రేవంత్‌ చెప్పినా ఆ వచ్చే బాహుబలి బాహరెడ్డి కావచ్చనిపిసుస్తంది. తెలంగాణలో ఒక శాతం కూడా లేని వెలమలు రాజ్యం చేస్తున్నారు గనక తక్కిన వారందరినీ సమీకరించి మళ్లీ పాత తరహా రెడ్ల ప్రాబల్యం పెంచాలని చూసే వారిలో ఆయన ఒకరు. చురుకైనా నాయకుడుగా తనే దానికి సరిపోతాననే భావన కూడా బయిటపెడుతుంటారు. అయితే ఉద్దండ పిండాలై`న కాంగ్రెస్‌ వాదులు రేవంత్‌ వంటి బయిటి క్యాండిడేట్‌ను తీసుకుని ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయడంజరగని పని. అసలు జెఎసి చైర్మన్‌ కోదండరాంనే కాంగ్రెస్‌ వాదులు దువ్వుతున్నారనే అనుమానం కూడా టిఆర్‌ఎస్‌లో బలంగా వుంది. సిఎం కెసిఆర్‌ ఆయనను అంత దూరం పెట్టడానికి అదే కారణమని చెబుతుంటారు.రెడ్డకోసం ఎంత కష్టపడినా లాభం లేదని ఇక వారిని వదిలిపెట్టాలని కూడా కెసిఆర్‌ నిర్ణయానికి వచ్చారట.కనుక నిస్సందేహంగా బాహుబలికన్నా బాహురెడ్డి అయ్యే అవకాశమే ఎక్కువని నిస్సందేహంగా చెప్పొచ్చు.అయితే కలెక్షన్లు ఎలా వుంటాయనేది చెప్పలేం. తాను దేశం కోసం కట్టప్పలా పనిచేస్తానని మోడీ చెబితే బాహుబలి వస్తాడని జానా అంటున్నారు. మొత్తానికి బాహుబలి రాజకీయ బుర్రలను కూడా ఆక్రమించేసాడన్న మాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close