రెచ్చగొట్టడం కోసమా? ప్రచారం కోసమా ఒవైసీ?

ముస్లిముల జీవితాలను ఉద్ధరించడం కోసమే ఉన్న నాయక కుటుంబం మాది అని ఒవైసీలు చెప్పుకుంటూ ఉంటారు. అంటే ముస్లిములను ఉద్ధరిస్తారు అని కాదు. ఉద్ధరించడం కోసమే ఉన్నాం, భవిష్యత్‌లో ఉద్ధరిస్తాం అని చెప్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులందరూ కూడా ఆరు దశాబ్ధాలకు పైగా చేస్తున్నది అదే. మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెప్తూ ఉంటారు. చేతలు మాత్రం వ్యక్తిగత అభివృద్ధి విషయంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆయా వర్గాలకు సంబంధించిన ఏదైనా ముఖ్య పరిణామం చోటు చేసుకున్నప్పుడు మాత్రం అందరికంటే ముందుగా స్పందిస్తూ ఉంటారు. మీడియాలో ప్రముఖంగా కనిపించాలనుకుంటారు. అలాగే ఆయా కుల, మత ఫీలింగ్స్‌ని మరి కాస్త రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలా రెచ్చిపోయే జనాలు లేకపోతే ఈ నాయకులు, నాయకుల వారసుల ఉపాధికి ప్రమాదం వస్తుంది మరి.

బాబ్రీ మసీదు కేసులో అద్వానీ, ఉమాభారతిలాంటి హిందూ మతాన్ని ఉద్ధరించడానికే పుట్టినవాళ్ళం అని ప్రచారం చేసుకునే చేసుకునే నాయకులకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు మంచిదే. విచారణ జరగాల్సిందే. తప్పు చేసి ఉంటే కచ్చితంగా శిక్షలు పడాల్సిందే. ఎందుకంటే జరిగిన దుర్ఘటన ఒక వర్గంలో ఉన్న ఆలోచనలేని మనుషులకు సంతోషం కలిగించొచ్చుగాక. కానీ ఇలాంటి దుందుడుకు చర్యలు ఏనాటికైనా మొత్తం భారతదేశానికే చేటు చేస్తాయి. ఆ తీర్పును అందరూ స్వాగతించాల్సిందే. కానీ ఆ తీర్పును రాజకీయంగా వాడుకుందాం అని బయల్దేరిన వాళ్ళతోనే సమస్య. ఇలాంటి వాళ్ళే రెండో వర్గాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా తీర్పు వచ్చిన వెంటనే మైనారిటీలను ఉద్ధరించే నేతలం అని చెప్పుకునే నేతలందరూ రెడీ అయిపోయారు. ఈ జాబితాలో భాజపా, శివసేనలాంటి పార్టీలను మినహాయిస్తే ఇక మిగతా పార్టీలన్నీ ఉన్నాయి. అందరు నేతలూ కూడా తలా ఒక స్టేట్‌మెంట్ పడేశారు. మీడియాలో ఎక్కువగా కనిపించడం, మైనారిటీల దృష్టిలో వాళ్ళ ప్రయోజనాల కోసం పాటుపడేనేతలుగా కనిపించడమే లక్ష్యంగా తలా ఒక ప్రకటన చేశారు.

దేశంలో ఉన్న పార్టీల అన్నింటికంటే, నేతలు అందరికంటే కూడా మైనారిటీలను ఎక్కువగా ఉద్ధరించేది మేమే అని చెప్పుకునే ఒవైసీ మాత్రం మీడియాలో కాస్త ఎక్కువ ప్రచారం కోరుకున్నాడో, లేక రెచ్చగొట్టాలనుకున్నాడో తెలియదు కానీ అనవసరంగా జాతిపిత మహాత్మాగాంధీ మరణంతో బాబ్రీ మసీదు కూల్చివేతను పోల్చాడు. పోలిక తెస్తూ మాట్లాడిన మాటలు కూడా ఆయన తెలివితేటలను ప్రశ్నించేలా ఉన్నాయి. మహాత్మా గాంధీ హత్య కేసు చాలా తక్కువ కాలంలోనే తేలిపోయిందట….బాబ్రీ కేసు మాత్రం చాలా ఎక్కువ సంవత్సరాలుగా సాగుతోందట…అందుకని గాంధీ హత్యకంటే బాబ్రీ కూల్చివేతే పెద్ద ఇష్యూ అని తేల్చేశాడు ఒవైసీ. మీడియాలో కనిపించాలి, రెచ్చగొట్టాలి, వివాదం రాజేయాలి అనే తాపత్రయం తప్పితే ఏమన్నా అర్థం ఉందా? అసలు ఆ రెండు సంఘటనలను పోల్చాల్సిన అవసరం ఏంటి? ఆవేశం తప్ప ఆలోచనలేని జనాలకు ఇలాంటి నాయకులు హీరోలుగా కనిపించొచ్చు కానీ ఏ కొంచెం ఇంగితం ఉన్నా కూడా వీళ్ళకసలు అస్థిత్వమే ఉండదు అన్నమాట వాస్తవం. మతాలను ఉద్ధరించే నాయకులు, కులాలను ఉద్ధరించే నాయకుల విషయంలో ప్రజలు కాస్త వివేచన చూపిస్తే చాలు…ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు చేసే ప్రయత్నం ఇంకే నాయకుడు చెయ్యడు. ఏ మతం, కులానికి చెందిన ప్రజలకైనా కాస్త మంచి చేసేదానికి ఎవ్వరూ ముందుకు రారు కానీ రెచ్చగొట్టడానికి, వివాదాలు రాజేయడానికి, వివాదాలను క్యాష్ చేయడానికి మన నాయకులు ఎప్పుడూ ముందే ఉంటారు. మంచి వైపు నడిపించాలంటే కష్టపడాలి, తెలివితేటలు ఉండాలి కానీ రెచ్చగొట్టడం ఎంతసేపు? అలాంటి వ్యాఖ్యలు, వివాదాలు నాయకులకు తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఎప్పుడు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close