నిహారిక పెళ్లి కథనాలపై బాబు గోగినేని వ్యాఖ్యలు, హేతువాది కీ కుల పిచ్చి అంటూ విమర్శలు

ప్రముఖ హేతువాది గా, నాస్తికుడిగా పేరు పొంది, సమాజంలోని మూఢనమ్మకాల పై విశేషంగా పోరాడి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుని, అప్పట్లో తరచూ టీవీ చానల్స్ లో కనిపిస్తూ ప్రజలను చైతన్యపరిచే బాబు గోగినేని, బిగ్ బాస్ షో లో పాల్గొని కౌశల్ దెబ్బకు టీవీ చానల్స్ లో కనిపించకుండా కనుమరుగైపోయిన సంగతి తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు బాబు గోగినేని. నిహారిక పెళ్లి సందర్భంగా బి బి సి లో వచ్చిన కథనాన్ని జత చేస్తూ ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ లో చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకే కాకుండా, సామాన్యులకు కూడా చిరాకు తెప్పించాయి. దాంతో సోషల్ మీడియాలో ఆయనపై మండిపడుతున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళితే..

సినిమా స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్, రాజకీయ నాయకులకు సంబంధించిన అంశాలపై ప్రజలకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. కొంతమంది మేధావులకు, సాధారణంగానే ఇది కంటగింపుగా ఉంటుంది. నిహారిక చైతన్య ల పెళ్లి గురించి, అది కోటలో వైభవంగా జరుగుతున్న విధానం గురించి సహజంగానే ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని గమనించి మీడియా సంస్థలు ఆ పెళ్లిన కవర్ చేస్తూ కథనాలు రాస్తున్నాయి. ఇందులో పెద్దగా తప్పు పట్టవలసింది ఏమీ లేదు. కానీ దీనిపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డాడు బాబు గోగినేని.

సొంత అచీవ్మెంట్ లేని నిహారిక, సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ నాగబాబు అంటూ బాబు గోగినేని వ్యాఖ్యలు:

బాబు గోగినేని తన సోషల్ మీడియా హ్యాండిల్ లో వ్రాసుకొస్తూ, “దీనికి తోడు BBC వారు పుణ్యం కట్టుకొని తిరుమల, యాదాద్రి లో దేవుళ్ళ నిద్రా శయనాల సమయాలూ, క్యూ టైమింగులు కూడా క్రమం తప్పకుండా చెప్తే మిగతా తెలుగు మాధ్యమాల లా మీరు లేరు ఏమిటీ అన్న బెంగ పోతుంది మాకు.

టీవీ లో కనిపించే ఎకిలి నవ్వుల సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ కూతురు పెళ్లి ఇంకో రాష్త్రం లో జరుగుతుంటే, ఇప్పటివరకూ ఒకరి కూతురిగా కాక ఇంకే విధమైన సొంత achievement లేని వారి కథనాన్ని ఇంకో పత్రిక ప్రచురిస్తే, ఆ పత్రికలోని వందల కథనాలతో మీరు దీనిని ఎన్నుకుని దాన్ని మీ ప్రెస్ రివ్యూ లో ప్రచురించడం భలే సంబరంగా ఉంది. వెడ్డింగ్ కార్డ్ కూడా చూపిస్తే బాగుండేది.” అంటూ విరుచుకుపడ్డారు బాబు గోగినేని.

బాబు గోగినేని వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో కౌంటర్స్:

అయితే బాబు గోగినేని వ్యాఖ్యలపై మండిపడుతున్నారు నెటిజన్లు. వెకిలి నవ్వుల సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ అంటూ నాగబాబు పై ఆయన చేసిన విమర్శలు ఆయన విజ్ఞతకే వదిలి వేస్తూ, ఎటువంటి అచీవ్మెంట్ లేని నిహారిక అన్న వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ నిహారిక తన స్థాయిలో కొద్దో గొప్పో విజయం సాధించిన సంగతి వారు గుర్తు చేస్తున్నారు. పేరొందిన ఆర్టిస్టుల రేంజ్ లో మెప్పించలేకపోయినప్పటికీ తాను హీరోయిన్ గా నటించిన సినిమాలలో తన పాత్రకు ఆవిడ పూర్తి న్యాయం చేసిన సంగతి వారు గుర్తు చేస్తున్నారు.

వెబ్ సిరీస్ అన్నది ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ, వాటికి అంత ప్రాచుర్యం లేని టైం లోనే వెబ్ సిరీస్ లలో నిహారిక ఒక ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో టీవీ9 ఛానల్ సీఈఓ గా ఉన్న రవి ప్రకాష్ సైతం తెలుగు ఇంటర్నెట్ ప్రపంచాన్ని రూల్ చేస్తున్న ప్రిన్సెస్ గా నిహారిక ను ఒక వేదికపై ప్రశంసించిన సంగతి కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఇక ప్రజలకు వినోదాన్ని కాలక్షేపాన్ని పంచే జబర్దస్త్ , అదిరింది వంటి ప్రోగ్రామ్స్ వెకిలి నవ్వు ల ప్రోగ్రామ్స్ అయితే , ఆయన పాల్గొన్న బిగ్ బాస్ షో లో చూపిస్తుంది ఏంటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు బాబూ, అంటూ ప్రశ్నలు :

నిహారిక పెళ్లి విశేషాలపై బీబీసీ తెలుగు కథనాన్ని ప్రచురించడం వల్ల ఈయనకు ఎందుకు అంత కడుపుమంట కలిగిందో జనాలకు కూడా అర్థం కావడం లేదు. బిబిసి తెలుగు లో అత్యంత ప్రాముఖ్యమైన వార్తలు మాత్రమే ప్రచురింపబడాలి అన్నది ఈయన ఉద్దేశ్యం అయితే, ఈయన బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు ఆ విశేషాల గురించి ఇంతకంటే పెద్ద కథనాన్ని గోగినేని ఇంటర్వ్యూ ని బిబిసి తెలుగు ప్రచురించినప్పుడు ఈయన ఎందుకని ఇది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు అని వారికి సర్ది చెప్పలేదు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

హేతువాది కి కూడా కుల పిచ్చి అంటూ విమర్శలు:

హేతువాది అయిన బాబు గోగినేని మూఢనమ్మకాలను ప్రశ్నించిన విధానం, చేసిన పోరాటం కారణంగా ఆయనకు అన్ని వర్గాలలోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆయన పని కట్టుకుని నిహారిక పెళ్లి సందర్భంలో మాత్రమే, ఆ కథనాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేయడం చూసి, ఈయనకు కూడా కుల పిచ్చి ఉందేమో అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నిహారిక కంటే ముందు ఎంతో మంది పెళ్లి కథనాలను బిబిసి తెలుగు మాత్రమే కాకుండా అనేక మీడియా సంస్థలు ప్రముఖంగా కథనాలు ఇచ్చాయి. తను పెళ్ళి చేసుకునే నాటికి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ గోగినేని పరిభాషలో చెప్పాలంటే “ఏమీ సాధించలేక పోయినప్పటికీ”, అప్పటి చానల్స్, మీడియా సంస్థలు ప్రముఖంగా ఆ పెళ్లి విశేషాలను ప్రసారం చేశాయి. ముఖేష్ అంబానీ ఇంట జరిగిన పెళ్లి కూడా ఇదే కోటలో జరిగినప్పుడు మీడియా సంస్థలు ఇదే తరహాలో కథనాలు ఇచ్చాయి. గోగినేని పరిభాషలో చెప్పాలంటే ముఖేష్ అంబానీ కూతురు ఆయన కూతురుగానే తప్ప “సొంతంగా ఏమీ సాధించలేదు” కాబట్టి ఆ పెళ్లికి సంబంధించిన విశేషాలను కూడా మీడియా సంస్థలు ప్రసారం చేయకూడదు. ఇలాంటి అనేక సందర్భాల్లో ఆ సమయంలో నోరుమెదపని బాబు గోగినేని, పనికట్టుకుని నాగబాబు కుటుంబంపై విమర్శలు చేయడం చూస్తుంటే, ఆయనకు కుల పిచ్చి ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించడం, ఆయన స్థాయిని బాగా దిగజార్చింది.

హేతువాదిగా నాస్తికుడిగా సంఘ సంస్కర్తగా ఆయన కృషి చేయాలనుకుంటే, ఆయన స్పందించవలసిన అనేక ముఖ్య సమస్యలు – నిహారిక పెళ్లి గురించి కథనం ప్రసారం చేయడం కంటే ముఖ్యమైన సమస్యలు- తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి తన కడుపు మంటను చల్లార్చుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని ఆయన అనుకుంటే అది ఆయన ఇష్టం. కాకపోతే రేపు పొద్దున మళ్లీ జనాల్లోకి వచ్చి తాను గొప్ప సంఘసంస్కర్తలా ఉపన్యాసాలు ఇచ్చి నప్పుడు మాత్రం ప్రజలు కచ్చితంగా ఈ కుల పిచ్చి గురించి కూడా ఆయన ని ప్రశ్నిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close