ఐశ్వర్యపై అమితాబ్ గుస్సా?

అందాల నటి ఐశ్వర్యా రాయ్ ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది పడుతోందట. ఐష్ చాలా కాలం తర్వాత ఓ ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ మూవీలో నటిస్తోంది. ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. జజ్బాలో ఓ పవర్ ఫుల్ మహిళగా లీడ్ రోల్ లో నటించింది. అయితే అది కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు. ఈ మధ్యే వచ్చిన సరబ్ జీత్ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఆడింది.

అవి ఎలా ఉన్నా, కరణ్ జోహార్ తాజా సినిమాలో ఐష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.
యే దిల్ హై ముష్కిల్ సినిమాలో రణబీర్ కపూర్ తో నటిస్తోంది. ఇందులో అనుష్క శర్మ మరోహీరోయిన్. దీపావళి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో ఐష్ బిజీ బిజీగా ఉంది.

ఇది రొమాంటిక్ సినిమా కాబట్టి హీరో హీరోయిన్ల మధ్య హాట్ కెమిస్ట్రీ తప్పదు. కథానుసారం కొన్ని సీన్లలో రణబీర్, ఐశ్వర్య క్లోజ్ గా నటించారట. రణబీర్ తో మరీ ఇంత సన్నిహితంగా నటించడం అవసరమా అని అమితాబ్ బచ్చన్ కుటుంబం ఫీలవుతోందట. ఇప్పుడు రొమాంటిక్ సినిమాలో నటించడం అవసరమా అని వాళ్ల అభిప్రాయం. అసలు ఐశ్వర్య ఈ సినిమా ఓకే చెప్పినప్పుడే బచ్చన్ ఫ్యామిలీకి ఇష్టం లేదట. అయినా ఆమె స్వేచ్ఛకు అడ్డు చెప్పడం ఎందుకని ఊరుకున్నార

ఇప్పుడు కూడా వాళ్లు నోరు తెరిచి ఏమీ అనకపోయినా, ఇశ్వర్యకు కొంచెం ఇబ్బందిగానే ఉందని టాక్. ఇంట్లో అంతా హాయిగా నవ్వుతూ గడిపే ఫ్యామిలీ. ఇప్పుడు కొంత ఎడమొహం పెడమొహంగా ఉండటంతో ఐష్ ఫీలవుతోందని, ఇబ్బంది పడుతోందని బాలీవుడ్ సమాచారం. పైగా ఈ సినిమా షూటింగ్ ఒక్క దేశంలో లేదు.

ఈ సినిమా షూటింగ్ లండన్ లో మొదలైంది. ఆ తర్వాత పారిస్ లో జరిగింది. అటు తర్వాత ఆస్ట్రియాలోని వియన్నా తదితర ప్రదేశాల్లో షూట్ చేశారు. ఆ తర్వాత ముంబైకి లొకేషన్ మార్చారు. కాబట్టి ఐష్ కూడా చాలా రోజులు ఇంటికి, దేశానికి దూరంగా విదేశాల్లో ఉంది. ముంబై షూటింగ్ పూర్తి చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, అక్టోబర్ 28న విడుదలకు దర్శక నిర్మాత కరణ్ జోహార్ భారీగా సన్నాహాలు చేస్తున్నాడు.

అన్నట్టు… ధూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో చనువుగా నటించడం కూడా అప్పట్లో బచ్చన్ ఫ్యామిలీకి నచ్చలేదని ప్రచారం జరిగింది. అప్పటికే ఐశ్వర్య, అభిషేక్ పెళ్లి దాదాపుగా ఖరారైంది. అలాంటి సమయంలో హృతిక్ తో ఐశ్వర్య లిప్ లాక్ సీన్ లో నటించడం అమితాబ్ దంపతులకు ఇబ్బంది కలిగించిందట. ఇప్పుడు రణబీర్ తో క్లోజ్ గా నటించడంపై ఫీలవుతున్నారట. ఒకింత కోపంగానూ ఉన్నారని బాలీవుడ్ ఖబర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close