నేతలకు పదవులిస్తే చాలు…రిజర్వేషన్ వర్గాలన్నీ హ్యాపీస్ అన్నట్టు..

మన నాయకులందరూ కూడా ప్రజలను లక్షాధికారులను చేయడం కోసం, కోటీశ్వరులను చేయడం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నట్టుగా డైలాగ్స్ కొడుతూ ఉంటారు. మన నాయకులకు డబ్బు పిచ్చ ఆ రేంజ్‌లో పట్టింది కూడా అభివృద్ధిని కూడా అలానే చూస్తారు మరి. జనాలకు కూడా అదే అలవాటు చేస్తారు. కానీ ఎవరి బ్రతుకులను అయితే ఉద్ధరిస్తామని, ఆ వర్గ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి పుట్టామని చెప్తూ ఉంటారో ఆ ప్రజల బ్రతుకుల్లో మాత్రం తరాలు గడిచిపోతున్నా పెద్దగా మార్పు రాదు కానీ ఆ ప్రజలను ఉద్ధరిస్తామని పుట్టుకొచ్చిన నాయకుల జీవితాల్లో మాత్రం చాలా మార్పులు వస్తూ ఉంటాయి. పాతబస్తీ ముస్లిములు విద్య, ఉపాధి, ఆరోగ్యం విషయాల్లో ఎంతలా వెనుకబడి ఉన్నారో ప్రభుత్వ సంస్థలే గణాంకాలతో సహా చెప్తూ ఉంటాయి. వాళ్ళను ఉద్ధరించడానికే పుట్టిన ఒవైసీలు ఏ స్థాయిలో ఉన్నారో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక బీసీలను ఉద్ధరించడానికే ఉన్నానని చెప్పుకున్న కృష్ణయ్య ఎమ్మెల్యే అయిపోయాడు. అలాగే మందకృష్ణ మాదిగ నాయకుడైపోయాడు. ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోవాలన్న రేంజ్‌లో రాజకీయం చేశాడు కానీ రాజకీయ వ్యూహాలు సరిపోయినట్టుగా లేవు. ఇక రెండు టెర్మ్‌ల నుంచీ ఎంపిగా ఉన్న టిడిపి ఎంపి శివప్రసాద్‌కి కూడా సడన్‌గా చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీఎస్టీల కోసం ఏమీ చేయలేదన్న విషయం గుర్తొచ్చింది. అలాగే జలీల్‌ఖాన్ అయితే ‘నాకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ముస్లిములకు అన్యాయం చేసినట్టే’ అని స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు.

ఇక్కడ ఈ నాయకులందరూ కూడా ఆయా వర్గాల ప్రయోజనాల కోసం పోరాడటాన్ని ఎవరూ తప్పుపట్టరు. అలాగే పదవులు పొందడం కూడా తప్పు కాదు. కానీ ఆ పదవుల కోసం ఆయ వర్గాల ప్రయోజనాలను అడ్డుపెట్టుకోవడం, పదవి దక్కగానే ఆయా వర్గాల ప్రజలను ఉద్ధిరంచే పనిని పక్కన పెట్టేసి సొంత అభివృద్ధి పనులు చేసుకుంటూ ఉండడం మాత్రం నాయకులపైనే నమ్మకం పోయేలా చేస్తోంది. పదవి దొరకనప్పుడు, ప్రభుత్వాధినేతలతో ‘సంబంధాలు’ సరిగ్గా లేనప్పుడు మాత్రం మన నాయకులకు వర్గ ప్రజల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న విషయం మా బాగా గుర్తుంటుంది. కాస్త హడావిడి చేస్తారు. మొత్తం వర్గ ప్రజలు అందరికీ ప్రయోజనాలు కల్పించాలన్న చిత్తశుద్ధి వాళ్ళ ఓట్ల కోసమే పనిచేస్తున్న మన ముఖ్యమంత్రులకు ఎలాగూ లేదు కాబట్టి ఈ నాయకులకు ‘మంత్రం’ వేస్తారు. దెబ్బకు వ్యవహారం సైలెంట్ అయిపోతుంది. దశాబ్ధాల తరబడి జరుగుతున్న తంతు ఇదే. బికాంలో ఫిజిక్స్ అన్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ని అందరూ ఆడిపోసుకున్నారు కానీ ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి నాయకుల అవసరం చాలానే ఉంది. అందరూ మహా మహా ఘటికులే ఉన్న చోట జలీల్‌ఖాన్‌లాంటి అమాయకులు కూడా ఉంటేనే ప్రజలకు అసలు వాస్తవాలు తెలుస్తాయి. వర్గ ప్రయోజనాల కోసం పోరుడుతున్నామని చెప్పుకుంటున్న నాయకులు…పదవులు దక్కని నాయకులందరూ కూడా …మా తాపత్రయం అంతా ప్రజల కోసమే అని చెప్పి బలంగా నమ్మించగలిగారు. ఒక్క జలీల్ ఖాన్ మాత్రమే…‘నాకు మంత్రి పదవి ఇస్తే ముస్లిములకు న్యాయం చేసినట్టే’ అని చెప్పి అసలు విషయం చెప్పి అడ్డంగా దొరికిపోయాడు. అదే జలీల్ ఖాన్ లాంటి నాయకులు ఎవరూ లేకపోతే…ఆ నాయకులు పని చేస్తోంది ప్రజల కోసం కాదు….పదవుల కోసం, స్వార్థం కోసం అన్న విషయం జనాలకు ఎలా అర్థమవుతుంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close