బాల‌య్య‌కు ‘హీరోయిన్‌’ క‌ష్టాలు

వ‌య‌సుబ‌డిన హీరోల‌కు క‌థానాయిక‌లు అంత తేలిగ్గా దొర‌క‌డం లేదు. సీనియ‌ర్ హీరోయిన్లు సైడ్ అయిపోవ‌డం, న‌య‌న‌తార‌లాంటి వాళ్లు లేడీ ఓరియెటెండ్ పాత్ర‌ల‌వైపు ట‌ర్న్ అవ్వ‌డంతో – వాళ్ల‌కు చాలా పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా అంటే.. క‌థానాయిక‌ని వెద‌క‌డం చాలా క‌ష్ట‌మైపోతోంది. న‌య‌న‌, శ్రియ లాంటి వాళ్ల‌ని రిపీట్ చేస్తూ ఆ లోటు కాస్త తీర్చుకున్నాడు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ `హీరోయిన్‌`క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

బాల‌కృష్ణ – కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌లే క్లాప్ కొట్టుకుంది. వ‌చ్చే నెల‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాలో క‌థానాయిక‌లెవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. పాయ‌ల్ రాజ్ పుట్ ఇది వ‌ర‌కు ఓకే అయ్యింది. అయితే.. ఈ సినిమా ఆల‌స్యం అవ్వ‌డంతో తాను ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంది. ఒక‌రిద్ద‌రు యువ క‌థానాయిక‌ల్ని చిత్ర‌బృందం సంప్ర‌దించింది. కానీ.. వాళ్ల డేట్స్ కూడా అందుబాటులో లేకుండా పోయాయి. మెహ‌రీన్ దాదాపుగా ఖాయం అనుకుంటే – త‌ను కూడా ఈ సినిమా చేయ‌లేనంటూ చేతులెత్తేసింది. దాంతో బాల‌య్య మ‌ళ్లీ న‌య‌న‌, శ్రియ‌లాంటి సీనియ‌ర్ల‌పైనే దృష్టి పెట్టాడ‌ని స‌మాచారం. కాజ‌ల్ పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంది. కానీ.. ఇవేం ఓ కొలిక్కి రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com