ఏఎన్ఆర్ పై బాలయ్య అనుచిత వ్యాఖ్య, సోషల్ మీడియాలో రచ్చ

వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో భాగంగా బాలకృష్ణ పరోక్షంగా అక్కినేని నాగేశ్వరరావు పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు కారణం అవుతున్నాయి. ఇవి బాలకృష్ణ స్థాయికి తగినవి కావు అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

వీరసింహారెడ్డి విజయోత్సవం లో భాగంగా బాలకృష్ణ దాదాపు అరగంటకు పైగా స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ ఇస్తున్న సమయం లో ఆర్టిస్టులు టెక్నీషియన్లు నిర్మాత దర్శకులతో పాటు అతిధులుగా వచ్చిన ఇతర హీరోలు దర్శకులు సైతం వేదిక పైన ఉన్నారు. అయితే బాలకృష్ణ ఈ స్పీచ్ ఇస్తున్నంత సేపు కూడా ఒక టాపిక్ నుండి మరొక టాపిక్ కి జంప్ అవుతూ, అనేక అసందర్భ విషయాలను కూడా ప్రస్తావిస్తూ తన స్పీచ్ కొనసాగించారు. గతంలో నటి శారద ని ఎన్టీఆర్ గారు ఎలా ప్రోత్సహించింది, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కాపు సామాజిక వర్గం వారు తమ నియోజకవర్గంలో ప్రతిష్టించింది, వంటి సినిమాకు సంబంధం లేని అనేక విషయాలను బాలకృష్ణ ప్రస్తావించి వేదిక పైన ఉన్న వారికే కాకుండా చూస్తున్న ప్రేక్షకులకు సైతం నీరసం తెప్పించారు. అయితే ఆర్టిస్టులను టెక్నీషియన్లను అందరినీ అభినందించిన తర్వాత నిర్మాతలను, కొందరు నటులను అభినందించే సమయం లో, ” అందరూ అద్భుతంగా నటించారు, వీరితో నాకు చక్కని టైంపాస్, శాస్త్రాలు, నాన్న గారి డైలాగులు , ఆ రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కినేని అంటూ అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం” అంటూ వ్యాఖ్యానించారు.

పాతకాలం నటులను, ఆ డైలాగులను నెమరు వేసుకొనే సంగతి మంచిదే అయినప్పటికీ, అక్కినేని తొక్కినేని అంటూ తేలిగ్గా మాట్లాడడం అక్కినేని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం మింగుడు పడలేదు. ఇటీవల అన్ స్టాపబుల్ కార్యక్రమం వల్ల ఎంతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న బాలకృష్ణ మళ్లీ పాత తరహా లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన అభిమానులకు సైతం నచ్చలేదు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చ కు కారణమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close