బాలయ్యా…ఇదేమి టైమింగ్ అయ్యా?

తెదేపా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసారు. ఈరోజు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్ధనలు నిర్వహించడానికి పోలీసులు అభ్యంతరం చెప్పడంతో, ఆయన ఆగ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి పిర్యాదు చేయడానికి వెళ్ళారని సమాచారం. కానీ బాలయ్య అక్కడికి వెళ్ళిన తరువాత వారిరువురూ సినిమాల గురించి చర్చించుకొన్నారు. వారివురి చెప్పుకొన్న ముచ్చట్లు, షేక్ హ్యాండ్ ఇచ్చుకొంటూ దిగిన ఫోటోలు మీడియాలో, వెబ్ సైట్లలో విసృతంగా ప్రత్యక్షమయ్యాయి.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు అవరోధాలు సృష్టిస్తున్నందుకు టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు తదితర తెదేపా నేతలు నిరసన తెలియజేస్తుంటే, బాలకృష్ణ వెళ్లి కేసీఆర్ తో ఫోటోలు దిగడం చూసి తెలుగు తమ్ముళ్ళు కంగు తిన్నారు. అది కూడా గ్రేటర్ ఎన్నికల సమయంలో. తాము తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే, బాలకృష్ణ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తో ముచ్చట్లు చెప్పుకోవడం, ఆయనతో ఫోటోలు దిగడం, జంట నగరాలలో ప్రజలకు తెరాసకు అనుకూలంగా సందేశం ఇచ్చినట్లయిందని వాపోతున్నారు.

గ్రేటర్ ఎన్నికల సమయంలో తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ వర్ధంతి రోజున పోలీసులు అవరోధాలు సృష్టించడం తెదేపాకు కలిసివచ్చే అంశంగా మారవలసింది. తెరాస ప్రభుత్వం స్వర్గీయ ఎన్టీఆర్ పట్ల అవమానకరంగా వ్యవహరించిందని గట్టిగా చెప్పుకొనే మంచి అవకాశం దక్కింది. మాగంటి గోపీనాద్ తదితరులు అక్కడ ధర్నా చేసారు కూడా. కానీ బాలకృష్ణ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ముచ్చట్లు చెప్పుకొని, ఆయనతో ఫోటోలు దిగడంతో తెరాసకు అనుకూల వాతావరణం సృష్టించినట్లయింది.

క్యాన్సర్ హాస్పిటల్ భవనాలను క్రమబద్దీకరణ చేయడం, ఆసుపత్రి ఆవరణలో నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం వంటి వాటి కోసం బాలకృష్ణ చేసిన విజ్ఞప్తుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చేయి. అలాగే బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలపై జరిగిన చర్చ, బాలకృష్ణ 100వ సినిమాలో ఆయన కుమారుడు మోక్షజ్ఞని పరిచయం చేయడం గురించి వారు చెప్పుకొన్న కబుర్లను మీడియా బాగానే కవర్ చేసింది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు అవరోధాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణతోనే కేసీఆర్ ఎన్టీఆర్ సినిమాల గురించి ముచ్చట్లు చెప్పి కూల్ చేయడం విశేషం.

బాలకృష్ణ ప్రదర్శించిన అత్యుత్సాహం వలన గ్రేటర్ ఎన్నికలకు ముందు తెదేపా నేతలకు దక్కిన ఒక మంచి అవకాశాన్ని కోల్పోతే, ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం కారణంగా తెరాసకు జరుగవలసిన పెద్ద నష్టాన్ని కేసీఆర్ తెలివిగా తప్పించేసారని చెప్పక తప్పదు. ఇప్పటికే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెరాస ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అనుసరిస్తున్న వైఖరితో చాలా ఇబ్బందిపడుతున్న తెలంగాణా తెదేపా నేతలకి, బాలయ్య బాబు కూడా మరో షాక్ తినిపించినట్లయింది.

సాధారణంగా ఒక ప్రతిపక్ష నేత పార్టీ మారడానికే ఇటువంటి విజ్ఞప్తులను కుంటిసాకులుగా చూపిస్తూ వెళ్లి కలుస్తుండటం రాజకీయాలలో ఒక ఆనవాయితీగా ఉంది. బాలయ్యకు అటువంటి ఆలోచన ఏదీ లేనప్పటికీ, సరిగ్గా గ్రేటర్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రిని కలిసి ఇటువంటి విజ్ఞప్తులు చేయడం, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు మీడియాలో వార్తలు రావడం తెరాసకు లాభం చేకూర్చేవిగా ఉంటే తెదేపాకు నష్టం కలిగించే అవకాశం ఉంది.

తమ పార్టీ ఎవరితో పోరాడుతోందో, ఎవరయితే తమ పార్టీని తెలంగాణాలో నామరూపాలు లేకుండా చేస్తున్నారో, అటువంటి వ్యక్తిని ఇటువంటి సమయంలో కలవడం, ముచ్చట్లు చెప్పుకోవడం, ఫోటోలు దిగడం రాజకీయ ఫార్ములాకి పూర్తి వ్యతిరేకమనే చెప్పక తప్పదు. గ్రేటర్ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఎలాగు ప్రచారం చేయరు. బాలయ్య బాబయినా ప్రచారం చేస్తారనుకొంటే ఆయన వెళ్లి తెరాస అధినేతతో ఫోటోలు దిగి వచ్చేరు. కనుక ఇకనయినా ముందుగా తెలంగాణా తెదేపా నేతలను సంప్రదించి, వారి సలహాలు, అభిప్రాయాల ప్రకారం ముందుకు సాగితే తెదేపాకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close